క్రైమ్/లీగల్

ఆడపిల్లలు పుట్టారని అత్తింటి వేధింపులు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, ఆగస్టు 27: నిర్మల్ జిల్లా కుంటాల మండలంలోని మహరాష్ట్ర సరిహద్దులో గల మారుముల గ్రామం అంబుగాంలో అమానూషం జరిగింది. ఆడపిల్లలు పుట్టారన్న కారణంతో అత్తమామ, భర్త వేదింపులకు మూడు ప్రాణాలు బలైపోయాయి. భాధిత కుటుంబీకుల కథనం ప్రకారం అంబకంటి తండాకు చెందిన జాదవ్ వసంత్- జిజాబాయిల కూతురు సుశీలబాయికి 2016లో అంబుగాం గ్రామానికి చెందిన అడే సంతోష్‌తో వివాహం జరిగింది. వీరి దాంపత్యానికి గుర్తుగా స్వప్న (2), కావేరి (2 నెలల పాప) జన్మించింది. రెండవ సంతానం సహితం ఆడపిల్లగ పుట్టడంతో గత నెల రోజుల నుండి ఆత్తమామలు, భర్త తీవ్రంగా వేదించినట్లు తెలిసింది. ఈ విషయం తన తల్లితండ్రులతో చెప్పుకుని అంబకంటిలో రోదించినట్లు తెలిసింది. అత్తింటి వేదింపులు ఆధికమవడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో సుశీలాబాయి (24) ఇద్దరు ఆడపిల్లలకు గుర్తు తెలియని విషం ఇచ్చి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు మృతి చెందిన సమాచారం అందుకున్న ఎస్సై యూనీస్ ఉన్నత ఆధికారులకు తెలిపారు. సంఘటన స్థలాన్ని భైంసా డీ ఎస్పీ అందేరాములు, సీ ఐ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. తల్లితో పాటు చిన్నారుల మృతదేహలను పరిశీలించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తెలిపారు.