క్రైమ్/లీగల్

స్కూల్ బస్సు కింద పడి చిన్నారి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇబ్రహీంపట్నం, ఆగస్టు 27: అన్నను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తల్లితో వెళ్లిన ఓ చిన్నారి అదే స్కూల్ బస్సు కిందపడి దుర్మరణం చెందిన సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి స్థానికులు, బంధువుల కథనం ప్రకారం బొంగ్లూరు గ్రామంలోని అంతఃపురం కాలనీకి చెందిన చందన, వెంకటేష్ దంపతుల కుమార్తె ప్రతీక (2) అన్న బొంగ్లూరు గేటు సమీపంలో ఉన్న సాహితీ పాఠశాలలో చదువుతున్నాడు. సోమవారం ఉదయం పాఠశాల బస్సు రావడంతో తల్లి బాలుడిని పాఠశాల బస్సు ఎక్కించేందుకు బాలుడితో పాటు ప్రతీకను వెంట తీసుకెళ్లింది. పాఠశాల బస్సు ముందుకు చిన్నారి వెళ్లడంతో ఇది గమనించకుండా డ్రైవర్ బస్సును పాపపైనుంచి పోనిచ్చాడు. దీంతో తీవ్రగాయాలపాలైన ప్రతీక అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక మృతికి పాఠశాల బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.