క్రైమ్/లీగల్

అత్తను హత్య చేసిన అల్లుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లవరం, ఆగస్టు 28: వివాహం నిశ్చయమై ఏడాథి గడుస్తున్నా పెళ్లి చేసేందుకు అత్తగారు జాప్యం చేస్తోందని ఆగ్రహించిన అల్లుడు ఆమెపై కత్తితో దాడిచేసి హత్య చేసిన సంఘటన అల్లవరం మండలం ఓడలరేవు గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. ఈ దాడిలో పొన్నమండ విష్ణుకుమారి (50) మృతి చెందింది. అల్లవరం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓడలరేవుకు చెందిన విష్ణుకుమారి కుమార్తె, అదే గ్రామానికి చెందిన చిలకలపూడి దుర్గాప్రసాద్ ప్రేమించుకున్నారు. వారి వివాహం పెద్దల సమక్షంలో గత ఏడాదిలో నిర్ణయించారు. అయితే అప్పటి నుండి విష్ణుకుమారి కుమార్తెతో దుర్గాప్రసాద్ సహజీవనం సాగిస్తున్నాడు. పెళ్లి నిశ్చయమైనపుడు నాలుగు సెంట్లు భూమిని దుర్గాప్రసాద్‌కు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఇటీవల పెళ్లి విషయంలో అల్లుడికి అత్తకు మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో దుర్గాప్రసాద్ మనస్తాపానికి గురై విష్ణుకుమారిపై సోమవారం అర్ధరాత్రి కత్తితో దాడి చేసి విచక్షణా రహితంగా గాయపర్చడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే దుర్గాప్రసాద్ మంగళవారం ఉదయం లొంగిపోయినట్టు ఎస్సై ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఈ విషయమై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.