క్రైమ్/లీగల్

రూ. 50 లక్షల చోరీ కేసులో నిందితుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 30:నగరంలోని రాజ్‌విహార్ హాటల్‌లో పార్కు చేసిన కారులో రూ. 50 లక్షలు చోరీకి గురైన కేసులో డ్రైవర్ వేముల మల్లికార్జునను అరెస్టు చేసినట్లు కర్నూలు డీఎస్పీ యుగంధర్‌బాబు తెలిపారు. అందుకు సంబంధించి డీఎస్పీ గురువారం నగరంలోని 2వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ రాజ్‌విహార్ హోటల్‌లో కడప జిల్లా నందలూరు మండలం చెన్నంగారిపల్లె గ్రామానికి చెందిన మేడ రామకృష్ణారెడ్డి కారులో ఉన్న తన రూ. 50లక్షలను అతడి డ్రైవర్ వేముల మల్లికార్జున చోరీ చేసి పారిపోయాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈక్రమంలో అందిన సమాచారం మేరకు నగర శివారులోని సుంకేసుల రోడ్డులో ఉన్న క్రిస్టియన్ శ్మశానవాటిక వద్ద అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా వాస్తవాలు బయటకి వచ్చాయి. దొంగను అరెస్టు చేసిన వారిలో 2వ పట్టణ సీఐ మంజునాథ్, ఎస్‌ఐ చంద్రశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ శివరామిరెడ్డి, చెంచన్న, ఖాజాహుస్సేన్, కానిస్టేబుళ్లు అయూబ్‌ఖాన్, మాధవస్వామి, రవికుమార్, హోంగార్డ్సు ఆనంద్, విజయ్‌కుమార్ ఉన్నారు. ఇక దొంగ హైదరాబాద్ హైవేపై మునగాలపాడు వైపు గట్టు కింద దాచిపెట్టిన రూ. 47,84,000, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.