క్రైమ్/లీగల్

మానవత్వం మరిచారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ, కేసు దర్యాప్తులో యూపీ పోలీసులు అనుసరించిన విధానంపై హైకోర్టు తీవ్రస్థాయి వ్యాఖ్యలు చేసింది. ఘజియాబాద్‌లో 2013లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసులో తీర్పునిస్తూ ‘పోలీసుల్లో మానవత్వం మంటగలిసిందా?’ అని ప్రశ్నించింది. కేసు దర్యాప్తు చేసిన ప్రాసిక్యూటర్, మరో మహిళా కానిస్టేబుల్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. ఓ పారా మెడికల్ విద్యార్థిపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది. డిసెంబర్ 16న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అడిషినల్ సెషన్స్ జడ్జి గుర్దీప్ సింగ్ సోమవారం తీర్పునిస్తూ నిందితుడైన ఆటో డ్రైవర్‌కు జీవిత ఖైదు విధించారు. ‘యూపీ పోలీసులు ఇదొక సాధారణ కేసులా వ్యవహరించటం సిగ్గుచేటు. బాలిక అత్యాచారానికి గురైతే, తక్షణం స్పందించాల్సిన దర్యాప్తు అధికారి తాపీగా వ్యవహరించారు. యూపీ పరిధిలోనే దుర్ఘటన చోటుచేసుకున్నా, ఢిల్లీలోని సీమాపురి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలంటూ బాధితురాలు, ఆమె తల్లిదండ్రులను పంపించటం క్షమించరాని విషయం’ అని అడిషినల్ సెషన్స్ జడ్జి గుర్దీప్ సింగ్ వ్యాఖ్యానించారు.