క్రైమ్/లీగల్

అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, ఆగస్టు 31: జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితులను శుక్రవారం స్థానిక తాలుకా పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ మీడియా ముందు హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఎఎస్పీ సాయికృష్ణ మాట్లాడుతూ గత నెల 31వతేదీన బంటుమిల్లి మండలం పెదతుమ్మిడి గ్రామానికి చెందిన వృద్ధురాలు బొల్లా నాగేశ్వరమ్మపై దాడి చేసి సుమారు రూ.18లక్షలు విలువ చేసే నగదు, బంగారు అభరణాలు తస్కరించిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బందరు తాలుకా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవి కుమార్ నేతృత్వంలో ఆరు బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అంతర్ జిల్లా దొంగల ముఠాకు చెందిన ఏడిద సత్యనారాయణ, చిన్నా, అబ్బులు, నందు, వంశీ, సోమరాజు, మజ్జి మణికంఠలు ముఠాగా ఏర్పడి చింతలపూడి, నర్సాపురం, పశ్చిమ, తూర్పు గోదావరి, సక్కినేటిపల్లి, నూజివీడు, బందరు తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిలో ఏడిద సత్యనారాయణ, రాము, గోవింద్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా పెదతుమ్మిడిలో చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. వీరి నుండి తస్కరించిన 798 గ్రాముల బంగారు అభరణాలు, 20కిలోల వెండి అభరణాలు, రూ.5.70లక్షలు నగదు, రెండు కార్లు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ముగ్గురిని న్యాయస్థానంలో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు పంపారన్నారు. మిగిలిన నలుగురు నిందితులను కూడా అదుపులోకి తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ మహబూబ్ బాషా, రూరల్ సీఐ బిబి రవికుమార్, ఇనగుదురు సీఐ అబ్దుల్ నబీ, బంటుమిల్లి ఎస్‌ఐ కె శ్రీనివాస్, తాలుకా ఎస్‌ఐ రంగనాధ్ తదితరులు పాల్గొన్నరు.