క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో లైన్‌మెన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి: ఏసీబీ వలలో చిన్న చేప పడింది. ట్రాన్స్‌కోలో ఏ పని జరగాలన్న అటెండర్ నుంచి అధికారుల వరకు చేతులు తడపాల్సిన పరిస్థతి నెలకొంది. నగరం, శివారు ప్రాంతాల్లోని ట్రాన్స్‌కో విభాగంలో పోస్టింగ్ కావాలంటే భారీ స్థాయి డబ్బులే చెల్లించడంతో పాటు పైరవీ చేయాల్సిందే. దానికి తోడు శివారు సబ్ స్టేషన్‌లలో లీడర్లుగా చెలామణి అవుతున్నా వారికి పోస్టింగ్ ఇవ్వడంతో విచ్చలవిడిగా అవీనితికి పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగిల్ ఫేస్ మీటర్ నుంచి సిటీ మీటర్ వరకు రేట్లు పెట్టి వినియోగదారుడి ముక్క పిండి మరీ వసూళ్లకు పాల్పడుతునట్లు ఆరోపణలు ఉన్నాయి.
శేరిలింగపల్లి పరిధిలో ఆరడజనుకుపైగా సబ్‌స్టేషన్‌లు ఉన్నాయి. ఇక్కడ పోస్టింగ్‌కు ఆ శాఖ మంత్రి సిఫార్సు చేస్తేనే సాధ్యమవుతుంది. 100 గజాల స్థలంలో ఐదు అంతస్తులు నిర్మిస్తుంటారు. హాస్టల్‌కు ఇస్తే తప్పకుండా కమర్షియల్ సిటీ మీటర్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. సిటీ మీటర్ ఏర్పాటుకు సబ్ స్టేషన్‌కు వెళ్తే వైరు, ఫ్యానల్ బోర్డు మీటర్‌కు కలిపి రూ.3లక్షల అంచనా వేస్తారు. సిటీ మీటర్ల దందా గచ్చిబౌలిలో మూడు మీటర్లు ఆరు ఫ్యానల్ బోర్డులా సాగుతుంది. గచ్చిబౌలి హౌసింగ్ బోర్డులోని ఓ భవనానికి సంబందించి ట్రాన్స్‌ఫారం, సిటీ మీటర్ ఏర్పాటుకు చేయడానికి కాంట్రాక్టర్ నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రాయించాడు. టెండర్ లక్షా 20వేలు రూపాయలకు లంచం లక్ష రూపాయలు డిమాండ్ చేయడంతో గత్యంతరంలేక చివరికి ఏసీబీని ఆశ్రాయించాడు. బేరం కుదిరిన తరువాత లైన్‌మెన్ ముందస్తుగా 60వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్‌గా పట్టుకున్నారు. వివరాలను ఏసీబీ డీఎస్‌పీ అచ్చేశ్వర రావు వెల్లడించారు.
గచ్చిబౌలి సిద్ధిఖ్‌నగర్‌లో నివాసముండే బాలకృష్ణ రెడ్డి కొంత కాలంగా టీఎస్ ట్రాన్స్‌కోలో కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నాడు. హౌసింగ్ బోర్డు కాలనీలో ఓ ఇంటికి ట్రాన్స్‌ఫారం, సిటీ మీటర్ ఏర్పాటు చేయడానికి లక్ష 20వేల రూపాయలకు ట్రాన్స్‌కో నుంచి టెండర్ తీసుకున్నాడు. 20 రోజుల నుంచి పనికి సంబంధించి సామగ్రికి ఏఈ, ఏడీఈ కార్యలయం చూట్టూ ఎన్ని సార్లు తిరిగినా పట్టించుకోలేదు. లక్ష రూపాయలు ఇస్తేనే టెండర్‌కు సంబంధించిన సామగ్రి ఇస్తామని లైన్‌మెన్ ఆకుల రాజేందర్ చెప్పినట్లు డీఎస్‌పీ తెలిపారు. లక్ష 20వేల పనికి లక్షరూపాయలు కమిషన్ చెల్లిస్తే నష్టపోతానని ఎంత చెప్పినా లైన్‌మెన్ పట్టించుకోలేదని తెలిపారు. ఇచ్చిన డబ్బులను అందరికీ ఇవ్వల్సి ఉంటుందని రాజేందర్ చెప్పినట్లు బాలకృష్ణారెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటల సమయంలో రూ.60వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.