క్రైమ్/లీగల్

ఫామ్‌హౌస్‌పై ఎస్‌ఓటీ పోలీసుల దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేశంపేట, సెప్టెంబర్ 4: కేశంపేట మండలం సంతాపూర్ గ్రామ శివారులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఒక ఫామ్‌హౌస్‌పై శంషాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా దాడులు నిర్వహించి 11మంది యువకులు, ఐదుగురు యువతులను వీరితోపాటు రూ.25వేల నగదు, రెండు కార్లు, ఒక బైక్, 26 సెల్‌ఫోన్లు స్వాధీన పర్చుకున్నారు. మంగళవారం రాత్రి ఏడు గంటల వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని, అర్థగంట తరువాత నమోదు చేసిన అనంతరం వివరాలు మీడియాకు తెలియజేస్తామని పోలీసులు తెలిపారు. పట్టుబడిన వారందరూ హైదరాబాద్, ముంబయికి చెందిన వారుగా గుర్తించారు. వారికి రాజకీయ పలుకుబడి ఉన్నందునే పోలీసులు కేసు నమోదు చేయడంలో జాప్యం చేస్తున్నారని సమాచారం.

గంజాయి విక్రేత అరెస్టు
మేడ్చల్, సెప్టెంబర్ 4: మేడ్చల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నిషేధిత గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు దాడి నిర్వహించి అరెస్టు చేశారు. ఎక్సైజ్ సీఐ జగన్‌మోహన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలో నివాసం ఉండే రాజు సహాని(35) మేడ్చల్ చెక్‌పోస్టు ప్రాంతంలో పలువురికి నిషేధిత గంజాయి విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు పక్కా పథకంతో మాటువేసి మంగళవారం రాత్రి దాడిచేసి అతన్ని పట్టుకున్నారు. అతని వద్ద తనిఖీలు నిర్వహించగా 230 గ్రాముల ఏండు గంజాయి లభించిందని, దానిని స్వాధీనం చేసుకుని నిందితుడు రాజుసహానీని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ వివరించారు. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నిషేధిత ఉత్ప్రేరకాలు ఎవరైనా గుట్టుగా విక్రయిస్తే 9440902319 ఫోన్ నెంబర్‌కు సమాచారం అందించాలని ఎక్సైజ్ సీఐ కోరారు. దాడిలో ఎక్సైజ్ సీఐతో పాటు ఎస్‌ఐ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.