క్రైమ్/లీగల్

గుంటూరు నగరంలో అర్ధరాత్రి అల్లరి మూకల వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట) : రాజధాని నగరంగా రూపాతంరం చెందుతున్న గుంటూరు నగరంలో అల్లరి మూకల దాడులు నానాటికీ పెరిగి పోతున్నాయి. కొంత మంది అల్లరి మూకలు రాత్రి పూట మద్యం సేవించి నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. తాజాగా మంగళవారం రాత్రి అరండల్‌పేట 8వలైన్ వద్ద టీ స్టాల్ వద్దకు నలుగురు యువకులు ఫుల్లుగా మద్యం తాగి సదరు టీ స్టాల్ వద్దకు వచ్చి సిగరెట్లు తీసుకున్నారు. అనంతరం టీ స్టాల్ యజమాని వారిని డబ్బులు ఇవ్వమని అడగగా మమ్మల్నే డబ్బులు అడుగుతావా అంటూ అతనిపై దాడి చేశారు. ఎవరికి చెప్పుకుంటే మాకేంటి అంటూ మేము ఎప్పుడు వచ్చినా అడిగినవి ఇవ్వాలంటూ అతనిపై దాడికి దిగారు. ఈ క్రమంలో ఇదంతా గమనిస్తున్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. టీ స్టాల్ యజమానిపై దాడి చేసిన వారిలో ఒకరికి రౌడీషీట్ ఉన్నట్లు తెలుస్తోంది. అతను ఓ ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన అనుచరుడిగా తెలిసింది. టీ స్టాల్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు నలుగురు యువకులను అరండల్‌పేట పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఇలాంటి ఘటనలు కోకొల్లలు... నగరంలో రాత్రిపూట అల్లరి మూకల చేష్టలు విపరితంగా పెరిగిపోతుండటంతో నగర వాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. గత నెల రోజుల కాలంలో రాత్రి పూట వూటుగా మద్యం సేవించి ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ వీరంగం సృష్టిస్తున్నారని నగర వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారులు రాత్రి పూట తగిన గస్తీని నిర్వహించకుంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉందని నగర ప్రజలు వాపోతున్నారు.