క్రైమ్/లీగల్

గుప్తనిధుల కోసం బాలుడి వేట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపూర్ రూరల్, సెప్టెంబర్ 7: గుప్త నిధుల విషయమై ఒక బాలుడిని బలి ఇస్తే కావాల్సినంత బంగారం వస్తుందని అందులో సగం బంగారం మీకు ఇస్తానని ఆశపడడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేసిన సంఘటన ఇది. బాలుడి తల్లితండ్రులు తెలిపిన వివరాల ప్రకా రం.. మండలంలోని బీర్నంది గ్రామపంచాయతీ పరిధిలోని రంగపేట కొత్తగూడెం గ్రామానికి చెందిన గోనే మహే ష్ పదమూడేళ్ల్ల బాలుడిని బలి ఇచ్చేందుకు తల్లితండ్రులతో మంతనాలు జరిపినట్టు చెబుతున్నారు. గోనె లచ్చన్న-లక్ష్మీల కుమారుడు మహేష్ 4వ తరగతి చదువుతున్నాడు. గోనె లచ్చన్న సోదరుడు గోనె లింగన్న వద్దకు వెళ్లి బాలుడు మహేష్‌ను బంగారంకోసం బలి ఇద్దామని కోరారు. 15 రోజుల క్రితం లింగన్న ఇంటికివెళ్లి ఎదురుకాళ్లతో పుట్టిన బాలుడు మహేష్‌ను బలిఇస్తే కావాల్సినంత బంగార దొరుకుతుందని, వచ్చిన బంగారంతో పెద్ద ఇళ్లు కట్టుకోవచ్చని సుఖంగా బతకవచ్చని నమ్మించే ప్రయత్నం చేశారు. గుప్తనిధులు దొరకాలంటే ఎదురుకాళ్లతో పుట్టిన బాలుడిని బలి ఇస్తే శాంతి జరిగి బంగారం వస్తుందని చెప్పారు. దీతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గ్రామ కమిటీకి ఫిర్యాదు చేశారు. అనంతరం ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎప్పటికైనా తమ కుమారుడు ప్రాణాపాయం ఉందని, వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎస్సై ప్రసాద్‌ను సంప్రదించగా నింధితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.