క్రైమ్/లీగల్

కానిస్టేబుల్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, సెప్టెంబర్ 7: మద్యానికి బానిస అయిన కానిస్టేబుల్ విధులు సరిగా నిర్వహించలేక క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నల్లగొండ జిల్లా చీకటిమామిడి గ్రామానికి చెందిన కోట ఉపేందర్ (39) పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా 2007లో చేరారు. ఉపేందర్ జిల్లెలగూడ మున్సిపాలిటీ గాయిత్రీ నగర్‌లో భర్యాపిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఉపేందర్‌కు భార్య ప్రభావతి, పిల్లలు భవ్య, అమని ఇద్దరు కుమార్తె ఉన్నారు. సంతోష్ నగర్ పోలీష్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. తాగుడుకు బానిసైన ఉపేందర్ విధులు సరిగా వేళ్లెవాడు కాదు. సంతోష్ నగర్‌లో సరిగా పనిచేయని కారణంగా ఉపేందర్‌ను పంజగుట్ట పోలీస్ స్టేషన్‌కు బదిలి చేశారు. ఉపేందర్‌ది అక్కడ కూడ తన తీరుమార్చుకోలేదు. సీఎం క్యాంపు కార్యాలయంలో డ్యూటీ వేశారు. ఉపేందర్‌లో మార్పు రాకపోవడంతో భార్య తన పిల్లలతో కలిసి పుట్టింటికి పోయింది. ఉపేందర్ 25 రోజులుగా డ్యూటీకి వెళ్లడం లేదు. గురువారం రాత్రి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉపేందర్ తన కార్యాలయానికి సెల్‌ఫోన్‌లో ఎస్‌ఎంఎస్ పంపి క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య పాల్పడినాడు. ఉపేందర్ కార్యాలయం నుంచి మీర్‌పేట్ పోలీసులకు సమచారం అందించగా, వెళ్లి చుసేసరికి ఉపేందర్ మృతిచెందాడు. మీర్‌పేట్ పోలీసులు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.