క్రైమ్/లీగల్

శుభలేఖలు పంచేందుకు వెళుతూ పెళ్లికొడుకు మృత్యువాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాల్వంచ, ఫిబ్రవరి 25: మరో ఆరు రోజుల్లో వివాహం చేసుకొని ఒక ఇంటివాడై ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఒక యువకుడు తన పెళ్లి శుభలేఖలను పంచుతూ కానరాని లోకాలకు వెళ్లాడు. ఈ దుర్ఘటన ఆదివారం పాల్వంచలో జరిగింది. మహబూబాబాద్ జిల్లా కె సముద్రంకు చెందిన కోరబోయిన ప్రవీణ్ (25) తన తండ్రి జనార్ధన్ ఇల్లందులోని ఒక బ్యాంకులో ఫీల్డ్ ఆఫీసర్‌గా పని చేస్తూ అక్కడే నివాసముంటున్నారు. అయితే ప్రవీణ్‌కు అశ్వాపురం మండలం మొండికుంట సమీపంలో గల మల్లెలమడుగు గ్రామానికి చెందిన ఒక యువతితో గత నెల రోజుల క్రితం వివాహం నిశ్చయమైంది. వచ్చే నెల 3న వివాహం జరగాల్సి ఉండగా ప్రవీణ్ తన పెళ్లి శుభలేఖలను పంచేందుకు తన ద్విచక్రవాహనం పై పాల్వంచకు వెళుతుండగా ప్రవీణ్ ద్విచక్ర వాహనాన్ని భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ఢీకొంది. ప్రమాదంలో ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. మరో 6రోజుల్లో ప్రవీణ్ వివాహతంతు జరగాల్సిన మల్లెల మడుగులోని అమ్మాయి ఇంట్లో, ప్రవీణ్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అమ్మ, నాన్న..... అక్క స్వప్న, విజయలకు, బంధుమిత్రులకు శుభలేఖలు ఇచ్చి వస్తానంటూ ఇంటి నండి చెప్పి వచ్చిన అతను పాల్వంచలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడన్న విషయం తెలుసుకున్న ప్రవీణ్ తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆసుపత్రి వద్ద రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది. ఈ మేరకు పాల్వంచ పట్టణ ఎస్‌ఐ ముత్యం రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.