క్రైమ్/లీగల్

ఇసుక అక్రమ రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, సెప్టెంబర్ 7: మండల పరిధిలోని దక్షిణచిరువోల్లంక కృష్ణానది రేవు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తుండటంతో ఆ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం మరబోట్ల ద్వారా అక్రమంగా ఇసుకను తవ్వి ఒడ్డుకు చేర్చి అక్రమార్కులు వ్యాపారం చేస్తుండటాన్ని గుర్తించిన గ్రామస్తులు అడ్డుకున్నారు. నదీ గర్భంలో అక్రమ తవ్వకాలు కారణంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, గతంలో ఈ తవ్వకాలు కారణంగానే పలువురు నీట మునిగిన సంఘటనలు ఉన్నందున గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అక్రమంగా రవాణా చేస్తున్న నావలను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ విషయమై అధికారులకు విన్నవించినా ప్రయోజనం లేదని, అదేమిటంటే అనుమతులు ఉన్నట్లు బుకాయిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. అక్రమ తవ్వకాలు లేకుండా అధికారులు అడ్డుకోవాలన్నారు.