క్రైమ్/లీగల్

సౌదీలో నేత కార్మికుడు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె: పొట్టకూటి కోసం ఓ చేనేత కార్మికుడు గల్ఫ్‌దేశాలకు వెళ్లాడు. అక్కడ ఏడారిప్రాంతంలో గొర్రెలను మేపలేక, అప్పులుచేసి గల్ఫ్‌లో సేట్లు పెడుతున్న కష్టాలు పడలేక, తిరిగి స్వదేశానికి వచ్చే మార్గం లేక, కనీసం భార్య, పిల్లలతో మాట్లాడే అవకాశం లేకుండా పోవడం.. బతుకుభారమైన ఓ చేనేత కార్మికుడు సౌదీలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం బుసిరెడ్డిగారిపల్లెకు చెందిన వెంకటేష్, లక్ష్మమ్మ వలసపై పాతికేళ్ల క్రితం మదనపల్లె నీరుగట్టువారిపల్లెకు చేరుకున్నారు. అద్దెఇంట్లో ఉంటూ వెంకటేష్ చేనేతమగ్గాలు నేసి కుటుంబాన్ని పోషించేవాడు. అతని కుమారుడు మల్లికార్జున(38) కూడా చేనేత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమ సంపాదన కుటుంబానికి సరిపోవడం లేదని భావించిన మల్లికార్జున(38) నెలన్నర రోజుల కితం కువైట్‌కు వెళ్ళాడు. అక్కడే తన మేనత్త పద్మావతి మంచిచెడు గమనిస్తు విషయాలు మల్లికార్జున కుటుంబసభ్యులకు చేరేవేసేది. కువైట్‌లోని సేట్ మల్లికార్జునను సౌదీకి పంపించి అక్కడ ఏడారిలో గొర్రెలు మేపేందుకు
పంపించాడు. తాను మోసపోయానని గ్రహించి, జరిగిన విషయమై కువైట్‌లో ఉంటున్న అత్త పద్మావతికి చెప్పుకున్నారు. ఈనెల 5వ తేది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కువైట్‌లోని మల్లికార్జున అత్త పద్మావతి మదనపల్లెలోని వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. లక్షలు అప్పులుచేసి కువైట్‌కు రావడం, వెళ్తే అవమానంతోపాటు, చేసిన అప్పులు వారు ఒత్తిడిలు ఎక్కువవుతాయని అవమానంగా భావించి ఆత్మహత్యకు పాల్పడివుంటారని కుటుంబసభ్యులు వాపోతున్నారు. ఆ తల్లీబిడ్డలకు ఆఖరి చూపుకైనా అవకాశం కల్పించేలా సౌదీలోని మల్లికార్జున మృతదేహాన్ని మదనపల్లెకు రప్పించాలని కుటుంబసభ్యులు, బంధువులు కోరుతున్నారు.