క్రైమ్/లీగల్

550 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుంగతుర్తి, సెప్టెంబర్ 9: గ్రామాల్లో వినియోగదారుల వద్ద రేషన్ బియ్యం కొనుగోలుచేసి వాటిని కర్ణాటక రాష్ట్రానికి తరలించి రీసైక్లింగ్ ద్వారా అధిక ధరలకు విక్రయించే వ్యక్తులను సూర్యాపేట జిల్లా తుంగతుర్తి పోలీసులు వలపన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. 550 బస్తాలతో (27 టన్నులు) లోడుతో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న లారీని, నిందితులను పట్టుకొని కేసునమోదు చేశారు. సూర్యాపేట డీఎస్పీ నాగేశ్వర్‌రావు ఆదివారం సాయంత్రం స్ధానిక పోలీస్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన వెలిశాల శేఖర్ చుట్టుపక్కల గ్రామాలలో రేషన్ బియ్యాన్ని వినియోగదారుల వద్ద సేకరిస్తుంటాడు. ఈ మేరకు బియ్యం బస్తాలను గ్రామానికి పక్కనే ఉన్న కేశవాపురం ప్రాంతంలోని తూము రమేష్ వ్యవసాయబావి వద్ద ఉన్న షెడ్‌లోనిల్వచేశాడు. కాగా, రంగారెడ్డి జిల్లా చౌళ్ళపల్లి ప్రాంతానికి చెందిన సుధాకర్‌కు చెందిన ఏపీ 22వై 8019 నంబరుగల లారీలో 550 బస్తాల బియ్యాన్ని లోడుచేసి కర్ణాటక రాష్ట్రానికి తరలించడానికి సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న సీఐ అయోధ్య సిబ్బందితో దాడి చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నింధితుడైన శేఖర్‌తో పాటు మరికొందరిపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్‌పీ వివరించారు. ముఖ్యంగా గ్రామాల్లో బియ్యాన్ని కిలో ఒక్కంటికి 5రూపాయలు చొప్పున కొనుగోలుచేసి దాన్ని ఏడు రూపాయలకు కర్ణాటకలో విక్రయిస్తాడని తెలిపారు. విక్రయించిన బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి మార్కెట్ ధర ప్రకారం బియ్యాన్ని అమ్ముతారని తెలిపారు. రేషన్ బియ్యం అమ్మకాలు చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఇప్పటికే సూర్యాపేట, కోదాడ ప్రాంతాల్లో బియ్యం అక్రమార్కులపై పీడీ యాక్టు కేసులు నమోదు చేశామని తెలిపారు. బియ్యం అక్రమ తరలింపుపై రెండు మూడుమార్లు పట్టుబడిన వారిపై పీడీయాక్టు కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీఐ అయోధ్య తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..పోలీసులకు పట్టుబడిన అక్రమ రవాణా చేస్తున్న రేషన్ బియ్యం లారీ, నిందితులు