క్రైమ్/లీగల్

చిన్నారిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, సెప్టెంబర్ 9: సభ్య సమాజం సిగ్గుపడేలా ముక్చుపచ్చలారని చిన్నారిపై మన్యంలో అత్యాచారం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం వాతంగి అనే మారుమూల గిరిజన పల్లెలో రెండో తరగతి చదువుతున్న బాలికపై అదే గ్రామానికి చెందినన 17 ఏళ్ల యువకుడు శుక్రవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి ఆదివారం జడ్డంగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. అదే గ్రామం లోని గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న చిన్నారికి శుక్రవారం సాయం త్రం 5గంటల సమయంలో చాక్లెట్లు ఇస్తానని మభ్యపెట్టి ఆ యువకుడు తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు, బాలిక తల్లి అక్కడికి చేరుకుని గది తలుపులను బలవంతంగా తెరిచారు. బాలికను బయటకు తీసుకురాగా, నింది తుడు పరారయ్యాడు. ఈ ఘటనపై తమకు న్యాయం చేయాలంటూ బా లిక తల్లిదండ్రులు రెండురోజులపా టు గ్రామపెద్దల వద్దకు తిరిగినా ఫలి తం లేకపోవడంతో ఎట్టకేలకు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైద్యపరీక్షల కోసం ఆదివారం రాత్రి బాలికను అడ్డతీగల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అడ్డతీగల సీఐ మురళీకృష్ణ అక్కడే బాలిక నుంచి వాం గ్మూ లం నమోదు చేశారు. నిందితుని కో సం తమ సిబ్బంది వాతంగి గ్రామాని కి వెళ్లి గాలింపు చేపట్టారని ఎస్సై గోపీనరేంద్రప్రసాద్ వివరించారు.