క్రైమ్/లీగల్

విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతసాగరం, సెప్టెంబర్ 10 : మండలంలోని పడమటికంభంపాడు గ్రామానికి చెందిన దాసరి పెంచలయ్య (54) విద్యుదాఘాతానికి గురై సోమవారం మృతిచెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరంటు పనులు చేసుకుని జీవనం సాగిస్తున్న పెంచలయ్య సోమవారం వాటర్ మోటారుకు మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. ఇంటి యజమాని గమనించి హుటాహుటిన ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న పెంచలయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు సోకసంద్రంలో మునిగిపోయారు. పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.