క్రైమ్/లీగల్

జంట పేలుళ్ల కేసులో ఇద్దరికి ఉరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 10: గోకుల్‌చాట్, లుంబినీ పార్కు జంట పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ కోర్టు సోమవారం నాడు తుది తీర్పును వెలువరించింది. ఇప్పటికే దోషులుగా ఖరారైన అనీఖ్ షఫీఖ్ సరుూద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు ఉరిశిక్ష విధించింది. ఒకొక్కరికీ చెరో 10వేల రూపాయిలు చొప్పున జరిమానా విధిస్తూ ఎన్‌ఐఏ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. ఈ కేసులో దోషులను గతంలోనే నిర్ధారించిన న్యాయమూర్తి, సోమవారం నాడు చర్లపల్లి జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానంలోనే తీర్పు చెప్పారు. జంట పేలుళ్లకు సంబంధించి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారనే కేసులో మహ్మద్ తారిక్ అంజుమ్‌ను కూడా దోషిగా తేల్చిన కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. జంట పేలుళ్ల కేసులో తుది తీర్పును సోమవారం నాడు వెలువరించనున్నట్టు గత వారమే న్యాయమూర్తి వెల్లడించడంతో జైలు పరిసరాల్లో బాధితులు, దోషుల కుటుంబ సభ్యులు, పోలీసు అధికారుల్లోనూ ఉత్కంఠ ఏర్పడింది. ఉదయమే జైలు పరిసరాల్లో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే విచారణ కొనసాగించిన న్యాయమూర్తి శిక్షకు సంబంధించి దోషులను కూడా తుదిసారి విచారించారు. ఈ కేసుల్లో తమకు ఎలాంటి భాగస్వామ్యం లేదని దోషులు న్యాయమూర్తి ఎదుట తమ వాదనలు వినిపించారు. పోలీసులు తమను ఇరికించారని ఆరోపించారు. కానీ పోలీసులు పక్కా ఆధారాలు సమర్పించడంతో వారికి శిక్షను నిర్థారించారు. ఈ నెల 4న అనీఖ్, ఇస్మాయిల్‌లను న్యాయస్థానం దోషులుగా తేల్చింది. 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లోని గోకుల్‌ఛాట్, లుంబినీ పార్కుల వద్ద జరిగిన జంట పేలుళ్ల కేసులో 44 మంది అమాయకులు మరణించారు. 66 మంది గాయపడ్డారు. ఈ ఘటనలకు సంబంధించి మూడు కేసులు నమోదయ్యాయి. రెండు పేలుళ్ల కేసులతో పాటు పేలకుండా దొరికిన బాంబులకు సంబంధించి మరో కేసును కూడా రిజిస్టర్ చేశారు. అనీఖ్ షఫీఖ్ సరుూద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భక్తల్, ఫరూఖ్ షార్బూద్దీన్, మహ్మద్ సిద్దిషేక్, అమీర్ రసూల్‌ఖాన్‌లను నిందితులుగా గుర్తించారు. వీరిలో అనీఖ్ షఫీఖ్ సరుూద్, మహ్మద్ అక్బర్
ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ సిద్దిషేక్ చర్లపల్లి జైలులోనే ఉన్నారు. రాష్ట్ర పోలీసు శాఖలోని కౌంటర్ ఇంటిలిజెన్స్ విభాగం కేసు దర్యాప్తు జరిపి ఏడుగురి అనుమానితుల పేర్లతో 1125 పేజీల మూడు అభియోగపత్రాలు దాఖలు చేసింది. 286 మంది సాక్షుల్ని కోర్టు విచారించింది. 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత నాంపల్లి రెండో అదనపు మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి మంగళవారం నాడు తీర్పు వెలువరించారు. బాంబులు పెట్టిన అనీక్ షఫీక్ సరుూద్ , అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలు నేరం చేసినట్టు న్యాయస్థానం తేల్చింది. మరో ఇద్దరు నిందితులు సాదిక్ ఇష్రార్ షేక్, ఫరూక్ సర్పుద్దీన్ తర్ఖాష్‌లను నిర్దోషులుగా పేర్కొంది. మరో నిందితుడు మహ్మద్ తారిఖ్ అంజుమ్ ఎహసాస్‌ను దోషిగా తేలుస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ కేసులో మిగతా ముగ్గురు నిందితులు రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమీర్ రిజుఖాన్‌లు పరారీలో ఉన్నారు.
తీర్పు వెలువడిన అనంతరం బాధితుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయం గెలించిందని వారు పేర్కొన్నారు.
అప్పీలుకు అవకాశం
న్యాయమూర్తి తీర్పు వెలువరించిన అనంతరం అప్పీలుకు అవకాశం కల్పించారు. నిందితులు తమ శిక్షను సవాలు చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నట్టు తెలిసింది.
చారిత్రక తీర్పు: బీజేపీ నేతలు
కుల్‌చాట్ పేలుళ్లలో ఉగ్రవాదులకు మరణశిక్ష విధించడం చారిత్రక తీర్పు అని ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు పేర్కొన్నారు. బాంబు పేలుళ్లలో చనిపోయిన వారి ఆత్మ సంతోషపడుతందని అన్నారు. దేశంలో ఉగ్రవాదం అణచివేయడానికి ఈ తీర్పు దోహదపడుతుందని పేర్కొన్నారు. తీర్పుపై జి కిషన్‌రెడ్డి స్పందిస్తూ గోకుల్‌చాట్ భయానక ఘటన అని అన్నారు. ఎప్పటికీ ప్రజలకు భయం కలిగించే సంఘటన అని, చాలా మంది ఉగ్రవాదులు పారిపోతున్నారని, గోకుల్‌చాట్ ఘటన ఉగ్రవాదులకు మరణశిక్ష విధించడాన్ని అన్ని వర్గాలూ స్వాగతిస్తున్నాయని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీలూ ఉగ్రవాదులకు శిక్ష విధించడంలో రాజకీయాలను పక్కన పెట్టి సహకరించాలని చెప్పారు.

చిత్రాలు.. పేలుళ్లు జరిగిన లుంబినీ పార్క్‌లోని లేజర్ షో థియేటర్, గోకుల్ చాట్. ఉరిశిక్ష పడ్డ అనీఖ్, అక్బర్ (ఫైల్)