క్రైమ్/లీగల్

రూ.1.43కోట్ల బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 5: మయన్మార్ నుండి చెన్నైకు బంగారాన్ని తీసుకువెళుతున్న ఓ వ్యక్తిని నెల్లూరు రైల్వేస్టేషన్‌లో డిఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి రూ.1.43కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఆర్‌ఐ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు.. గౌహతి-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం అందుకున్న విజయవాడ డీఆర్ ఐ డిప్యూటీ డైరక్టర్ రామకృష్ణ నేతృత్వంలోని సిబ్బంది నెల్లూరు రైల్వేస్టేషన్‌లో నిందితుడిని పట్టుకొని అతని సామగ్రిని పరిశీలించారు. అతని బ్యాగులో ఉన్న రెండు స్టౌవ్‌లలో గుండ్రటి ముద్ద ఆకారంలో ఉంచిన 4.658కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించారు.