క్రైమ్/లీగల్

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాచర్ల, సెప్టెంబర్ 11: మైనర్ బాలికపై పైచాచికంగా అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు రంగస్వామిని అరెస్టు చేసినట్లు మార్కాపురం డివైఎస్‌పి రామాంజనేయులు, ఎస్‌ఐ నాగశ్రీను తెలిపారు. మంగళవారం పోలీసుస్టేషనును రామాంజనేయులు సందర్శించారు. ఈసందర్భంగా డివైఎస్‌పి రామాంజనేయులు మాట్లాడుతూ శనివారం రాత్రి తల్లి ఇంట్లో లేని సమయంలో తాగిన మైకంలో 12 సంవత్సరాల బాలికను అత్యాచారం చేసిన రంగస్వామి అనుములపల్లి దగ్గర ఉండగా అరెస్టు చేసినట్లు తెలిపారు. గతంలో రెండు కేసుల్లో రంగస్వామి ముద్దాయిగా ఉన్నట్లు తెలిపారు. రౌడిషీట్ ఒపెన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇతనిపై పోక్సో, ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు తప్పించుకోకుండ చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.