క్రైమ్/లీగల్

నెల్లూరు వ్యక్తి ఆత్మహత్యాత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గంపేట, సెప్టెంబర్ 11: నెల్లూరు పట్టణాకి చెందిన మంగళపూడి సుబ్బారెడ్డి ఈనెల 9న జగ్గంపేటలో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అతనిని స్థానిక ప్రెవేటు ఆస్పత్రిలో చేర్పించగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సబంధించి మంగళవారం జగ్గంపేట సీఐ పి కాశీ విశ్వనాథం విలేకర్లతో మాట్లాడుతూ స్థానిక గోకవరం రోడ్డులో సుబ్రహ్మణ్యం స్వామి గుడి వద్ద పోలవరం కాల్వ వద్ద సుబ్బారెడ్డి ఒంటికి నిప్పు పెటుకున్నాడని సీఐ తెలిపారు. కర్నూలు పట్టణానికి చెందిన వీరపనేని చెన్న కేశవులు అనే వ్యక్తికి ఒకటి రెండు రెట్లు సొమ్ము ఇస్తానని విజయనగరం జిల్లా గంగాడ గ్రామానికి చెందిన జోనుల శ్రీనివాసరావు ఆశ చూపాడు. మొదట్లో కొద్ది సొమ్ము ఎరచూపడంతో నమ్మిన చెన్న కేశవులు 8నెలల క్రితం సుమారు రూ 10 లక్షలు అసలు నగదును శ్రీనవాసరావుకు ఇచ్చాడు. శ్రీనివాసరావు ఆ సొమ్మును తీసుకుని రెట్టింపు ఇచ్చే క్రమంలో పైన కింద ఒరిజనల్ నోట్లు ఉంచి మధ్యలో తెల్లకాగితాలను పెట్టి మోసానికి పాల్పడ్డాడు. తరువాత ఇంటికి వెళ్ళి చూసుకుని మోసాన్ని గ్రహించి శ్రీనివాసరావు గురించి చెన్నకేశవులు అనుచరులతో గాలిస్తున్నాడు. ఈ క్రమంలో అతని గురించి ఎలాగోలాగా తెలుసుకుని ఫోన్ ద్వారా మంతనాలు సాగించి భేటీకి నిర్ణయిచున్నారు. ఈక్రమంలో ఈనెల 9న తెల్లవారుజాము సమయంలో జగ్గంపేట శివారు పోలవరం కాల్వ వద్ద సుబ్రహ్మణ్యేశ్వరస్వామి గుడి వద్ద చెన్నకేశవులు, అనుచరులు శ్రీనివాసరావు, అనుచరుడు సుబ్బారెడ్డి, విజయనగరానికి చెందిన రియాజ్‌ఖాన్, కాకినాడకు చెందిన తోలపు రామారావు, తలాటి రాజేష్ భేటీ అయ్యారు. ఈ క్రమంలో సొమ్ము విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా పథకంలో భాగంగా సుబ్బారెడ్డి అతనితో పట్టుకొచ్చిన పెట్రోల్‌ను మీద పోసుకుని నిప్పు పెట్టుకున్నాడు. వెంటనే చెన్నకేశవులు, మిగిలిన వారు అతనిని జగ్గంపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. కాగా సుబ్బారెడ్డి స్టేషన్‌లోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని, దానిని వక్రికరించేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. సుబ్బారెడ్డిని కొందమంది స్కార్పియో వాహనంలో నోటికి గుడ్డలు కట్టి జగ్గంపేట వైపునకు ఈనెల 2వ తేది తీసుకు వస్తుండగా అక్కడ టోల్ ప్లాజా దాటే సమయంలో కొంతమంది వ్యాపారస్తులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పోలీసులు వాహనాన్ని పట్టుకుని అందులోని వారిని పట్టుకుని విచారించారని సమాచారం. ఇందులో భాగంగానే సుబ్బారెడ్డిని ఇరికించే ప్రయత్నం జరుగుతోందని భయపడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. కాగా ఇది తప్పుడు ప్రచారం అంటూ జగ్గంపేట సిఐ పికాశీ విశ్వనాధం ఖండించారు. ప్రైవేటు వైద్యుడు సమాచారంతో పోలీసులు వివరాలు సేకరించారు. చెన్నకేశవులు ఫిర్యాదు మేరకు సుబ్బారెడ్డి, రియాజ్‌ఖాన్, రామారావు, రాజేష్‌పై కేసు నమోదు చేసినట్టు సీఐ కాశీ విశ్వనాథం చెప్పారు.