క్రైమ్/లీగల్

అక్రమంగా బ్లాస్టింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, సెప్టెంబర్ 11: అక్రమంగా బ్లాస్టింగ్‌లు చేస్తున్న నలుగురు వ్యక్తులను ఎస్‌ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం కొందుర్గు మండల కేంద్రం సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న పేలుడు పదార్థాలను ఎస్‌ఓటీ పోలీసులు పట్టుకున్నారు. సైబరాబాద్ ఎస్‌ఓటీ సీఐ ప్రవీణ్ రెడ్డి కథనం ప్రకారం.. మండల కేంద్రం సమీపంలో గోపాల్‌రెడ్డి అనే వ్యక్తి క్రషర్ పరిశ్రమను కొనసాగిస్తున్నారు.
పెద్దపెద్ద రాళ్లను బద్దలు కొట్టేందుకు కాంట్రాక్టర్ చందు, శ్రీను అనే వ్యక్తులతో కలిసి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా 100డినోనేటర్లు, 75జిలెటిన్ స్టిక్స్ రవాణా చేస్తుండగా సమాచారం అందుకుని దాడులు చేసి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా హైదరాబాద్ నుంచి రవాణా చేయడంతోపాటు కొందుర్గు మండల కేంద్రంలో నిల్వలు చేస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. మంగళవారం దాడులు చేసి 100 డిటోనేటర్లు, 75జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకోవడంతోపాటు మూడు టిప్పర్లు, ఒక ఇటాచి వాహనాలను సీజ్ చేసినట్లు వివరించారు. కేసు నమోదు చేసి స్థానిక పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు. కొందుర్గు మండల కేంద్రంలోని సెంట్రల్ రైల్వే స్టాల్‌లో అక్రమంగా నిల్వ చేసిన 95వాటర్ బాటిళ్ల కాటన్లు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఎస్‌వోటీ ఏఎస్‌ఐ అంతిరెడ్డి, సిబ్బంది బాలు నాయక్, వెంకట్ రెడ్డి ఉన్నారు.

పేకాడుతున్న 17మంది అరెస్ట్
* రూ.4.40 లక్షల సొత్తు స్వాధీనం
జీడిమెట్ల, సెప్టెంబర్ 11: పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసిన సంఘటన బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. బాచుపల్లి గ్రామం, రాజీవ్ గాంధీనగర్‌లో గుట్టు చప్పుడు కాకుండా శివరాజ్ శర్మ, శ్రీనివాస్ రావు, వెంకటేశ్వర రావు, రమేశ్, పవన్ కుమార్, కంచన్ రావు, అనిల్, శ్రీనివాస్, దశరధి, కేవీఎన్ గోపి కృష్ణ, కిషోర్, వెంకటేశ్, రన్‌దీర్ బాబు, హెచ్‌ఎస్‌సీ బోస్, వైవీ చౌదరి, రవికుమార్, సుబ్రమణ్యం తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి రూ.4,40,690ల నగదు, 15 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.