క్రైమ్/లీగల్

715 కిలోల గంజాయి పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, సెప్టెంబర్ 12: విశాఖ ఏజెన్సీ నుంచి ఒడిషాకు తరలిస్తున్న 715 కిలోల గంజాయిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బుధవారం పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 30 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ముంచంగిపుట్టు మండలం లబ్బూరు నుంచి ఒడిస్సా ప్రాంతానికి గంజాయి తరలిస్తున్నట్టు ముందుగా సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు లబ్బూరు గ్రామ సమీపాన నిఘా వేసి వ్యాన్‌లో తరలిస్తున్న గంజాయిని పట్టుకుని వాహనాన్ని సీజ్ చేసారు. గంజాయితో పాటు వాహన డ్రైవర్‌ను అరెస్ట్ చేసారు. గంజాయి రవాణా చేస్తున్న వాహన డ్రైవర్‌పై కేసు నమోదు చేసామని, కోర్టులో హాజరు పరిచి విశాఖపట్నం కేంద్ర కారాగారానికి రిమాండ్ నిమిత్తం తరలించనున్నట్టు ఎక్సైజ్ శాఖ పాడేరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రాజారావు తెలిపారు.