క్రైమ్/లీగల్

గంజాయి విక్రయస్తున్న వ్యక్తి రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జహీరాబాద్, సెప్టెంబర్ 15: అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న ఓ వ్యక్తిని జహీరాబాద్‌పోలీసులు పట్టుకుని శనివారం రిమాండ్‌కు పంపించారు. ఆయన వద్దనుంచి ఎండు గంజాయితోపాటు నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బన్సీలాల్(35)ను శనివారం రిమాండ్‌కు పంపించినట్లు డీఎస్పీ నల్లమల రవి తెలిపారు. ఈ సందర్భంగా పోలిస్టేషన్లో నిర్వహించాన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులనుంచి జాదవ్ బన్సీలాల్(35)తోపాటు ఆయన ఇద్దరు అనుచరులు రాథోడ్ బాబు, రాజ్‌కుమార్‌లతో కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నారు. పట్టణంలోని సిద్ధివినాయక ఆయిల్‌మిల్ క్రాస్‌లో జాతీయ రహదారిపై ఎండు గంజాయిని అమ్ముతున్నట్లు అందిన సమాచారం మేరకు ఎస్‌ఐ.సత్యనారాయణ సిబ్బంధితో కలిసి దాడిచేశాడు. మోటార్‌బైక్‌తోపాటు బన్సీలాల్‌ను పోలీసులు పట్టుకోగా ఇద్దరు నిందితులు పరారయ్యారు. ఆయన నుంచి 200 గ్రాముల బరువున్న 60 ఎండు గంజాయి పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం 12 కిలోలుంటుందన్నారు. అదేవిధంగా ఒక హీరోహోండా మోటర్‌సైకిల్, రూ.80వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీచెప్పారు. పరారీలో ఉన్న ఆయన అనుచరులు ఇద్దరిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. అక్రమ వ్యాపారాలను సహించేది లేదని, నిందితులను చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సీఐ.సైదీశ్వర్, ఎస్‌ఐ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.