క్రైమ్/లీగల్

మార్చి 15లోగా ఎల్‌పీసెట్ నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: లాంగ్వేజి పండిట్ ట్రైనింగ్ కోర్సు ప్రవేశపరీక్షను వచ్చే నెల 15వ తేదీలోగా నిర్వహించాలని హైకోర్టు సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ కె విజయలక్ష్మిలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రమాణాలను పెంచడానికి కోర్సు వ్యవధిని 9 నెలల నుండి రెండేళ్లకు పెంచినా, ప్రస్తుత బ్యాచ్ కోర్సు వ్యవధిని 9 నెలలకే కుదించాలని పేర్కొంది.
2016 అక్టోబర్‌లో హైకోర్టు న్యాయమూర్తి ఎల్‌పి సెట్‌ను ఆరు వారాల్లో నిర్వహించాలన్న ఆదేశాలపై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి హైకోర్టులో అప్పీలు చేశారు. అయితే ఎన్‌సిటిఇ మార్గదర్శకాలు మార్చకుండానే రాష్ట్ర ప్రభుత్వం మార్చడం సరికాదని, తక్షణమే ఎల్‌పిసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.