క్రైమ్/లీగల్

ఆర్మీ స్టిక్కరింగ్‌తో ఎర్రచందనం అక్రమ రవాణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 21: ఎర్రచందనం అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్లు కొత్త మార్గాలను అనే్వషిస్తుంటే వాటిని టాస్క్ఫోర్స్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో చిత్తు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం జీవకోన సమీపంలోని బీడి కాలనీ వద్ద టాస్క్ఫోర్స్ ఆర్‌ఎస్‌ఐ విజయ నరసింహులు బృందం కూంబింగ్ నిర్వహించింది. ఉదయం 5గంటల సమయంలో ఒక కారు అటుగా రావడాన్ని గమనించారు. అప్రమత్తమైన సిబ్బంది నిశితంగా పరిశీలించగా కొందరు స్మగ్లర్లు వాహనంలోనికి ఎర్రచందనం లోడ్ చేసేందుకు యత్నించారు. వెంటనే టాస్క్ఫోర్స్ సిబ్బంది వారిని పట్టుకునేందుకు యత్నించారు. టాస్క్ఫోర్స్ సిబ్బంది రాకను గుర్తించిన స్మగ్లర్లు కారు, దుంగలను వదిలేసి పారిపోయారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించగా నాలుగు ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా వాహనంపై ఆర్మీ అనే స్టిక్కర్ ఉండటాన్ని గగుర్తించారు. అనంతరం డాగ్‌స్క్వాడ్ సహాయంతో కూంబింగ్ కొనసాగించారు. ఈ క్రమంలో తరలించేందుకు స్మగ్లర్లు దాచి ఉంచిన మరో 6దుంగలను గంగా అనే డాగ్ కనుగొన్నది. దీంతో మొత్తం 10 ఎర్రచందనం దుంగలు గుర్తించారు. సంఘటనా స్థలాన్ని టాస్క్ఫోర్స్ డీఎస్పీ వెంకటరమణ, ఆర్‌ఐ చంద్రశేఖర్, మురళి, ఏసీఎఫ్ కృష్ణయ్య, ఎఫ్‌ఆర్‌ఓలు లక్ష్మీపతి, ప్రసాద్‌లు పరిశీలించారు. ప్రతిభ చాటిన టాస్క్ఫోర్స్ సిబ్బందిని ఐజీ డాక్టర్ కాంతారావు అభినందించారు.