క్రైమ్/లీగల్

జంట హత్యల కేసు మరోమారు వాయిదా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, సెప్టెంబర్ 25: ఎమ్మెల్సీ, శాసనమండలి విప్ రామసుబ్బారెడ్డిపై అభియోగం ఉన్న షాద్‌నగర్ జంటహత్యల కేసు విచారణ మరోమారు వాయిదా పడింది. సమాచారం మేరకు మంగళవారం సుప్రీం కోర్టులో కేసుకు సంబంధించి ఉన్న పిటిషన్లలో ఒక పిటిషన్ విచారణ ముగియగా, మరో పిటిషన్‌కు సంబంధించి అక్టోబర్ 24వ తేదీకి వాయిదా పడింది.
మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ జంటహత్యల కేసులో ప్రస్తుత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటు మరో నలుగులు నిందితులుగా ఉన్నారు. 1990లో జరిగిన జంటహత్యలపై షాద్‌నగర్ పియస్‌లో 183/1990గా కేసు నమోదయింది. దీనికి సంబంధించి 2004లో హైదరాబాదు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి అభియోగం ఉన్న రామసుబ్బారెడ్డికి యాజవజ్జీవ శిక్ష విధించడం జరిగింది. దీనిపై హైకోర్టుకు అప్పీలుకు వెళ్లగా 2006లో కేసును కొట్టివేయడం జరిగింది. అయితే మృతుడు శంకర్‌రెడ్డి కుమారుడు శివనారాయణ 2008లో సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయగా 1373నెంబరుగా, అలాగే ప్రభుత్వం తరపున దాఖలు చేసిన పిటిషన్‌కు 1374 నెంబరుగా కేసులు నమోదయి నడుస్తోన్నాయి. వీటికి సంబంధించి విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చి ఈ నెల 19వ తేదీ విచారణకు రావాల్సి ఉండగా 25వ తేదీకి వాయిదా పడింది. మంగళవారం కేసుకు సంబంధించి రెండు పిటిషన్‌లపై విచారణ చేపట్టగా బాధితుడి తరపు పిటిషన్ 1373 విచారణ ముగిసింది. అయితే ప్రభుత్వం తరపున ఉన్న పిటిషన్ 1374కు సంబంధించిన విచారణ అక్టోబర్ 24వ తేదీకి వాయిదా పడింది. దీంతో రెండవ పిటిషన్ విచారణ అనంతరం కేసుకు సంబంధించి తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసు విచారణ విషయం ఉత్కంఠగా మారిన నేపథ్యంలో మరోమారు వాయిదా పడడంతో తీర్పుపై సర్వత్రా ఆసక్తిగా మారింది. అప్పట్లో ప్రత్యర్థులుగా ఉన్న ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో కేసు విషయం తీవ్ర ఉత్కంఠగా మారింది.

‘ఎర్ర’ దుంగల మాయం కేసులో..నలుగురిపై వేటు
బద్వేలు, సెప్టెంబర్ 25: బద్వేలు అటవీశాఖ గోడౌన్ నుంచి 18 ఎర్రచందనం దుంగలను మాయమైన సంఘటనకు సంబంధించి నలుగురు ఉద్యోగులపై వేటు పడింది. ఫారెస్టు బీట్ ఆఫీసర్ నారాయణస్వామి, సెక్షన్ ఆఫీసర్ వెంకటరమణ, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు శాంతిప్రసన్న, జాకీర్ హుసేన్ సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గోడౌన్ నుంచి 18 ఎర్రచందనం దుంగలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. ఈ సంఘటనపై సోమవారం ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ సుభాష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. దీనిపై ప్రొద్దుటూరు డీఎఫ్‌ఓ గురుప్రభాకర్, మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, అర్చన్, రూరల్ సీఐలు రమేష్‌బాబు, రెడ్డప్ప ఆధ్వర్యంలో విచారణ వేగవంతం చేశారు. ఎర్రచందనం దుంగల మాయం వెనుక నలుగురు అధికారులు ఉన్నట్లు ప్రాథమిక నిర్దారణకు రావడంతో వీరిపై వేటు వేశారు.