క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోటవురట్ల, సెప్టెంబర్ 26: మండలంలో రామచంద్రపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం చెందాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈసంఘటనకు సంబంధించి స్థానిక ఎస్సై మధుసూధనరావు బుధవారం అందజేసిన వివరాలిలా ఉన్నాయి. రామచంద్రపురం గ్రామానికి చెందిన యువకుడు కొండ అశోక్‌కుమార్ (23) గ్రామంలో ఇంటి నుంచి రామాలయానికి వస్తుండగా మితిమీరిన వేగంతో వస్తున్న ట్రాక్టర్ ఢీ కొంది. దీంతో తీవ్రంగా గాయపడిన అశోక్‌కుమార్‌ను స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో అశోక్‌కుమార్‌కు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్య సేవలకై నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మద్యలో మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై మధుసూధనరావు తెలిపారు.