క్రైమ్/లీగల్

ఇళ్లల్లో చోరీ కేసుల్లో పాత నేరస్థుని అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 27: రాత్రి వేళ ఇళ్లల్లో చోరీలకు పాల్పడిన పాత నేరస్తుడిని సిసిఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి రూ.5.75 లక్షలు విలువైన చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీసీపీ బి రాజకుమారి తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కంకిపాడు ఈడ్పుగల్లుకు చెందిన లావేటి విమల్‌కుమార్ అలియాస్ పండు (24) పాత నేరస్తుడు ప్రస్తుతం చెన్నై గోల్డెన్ బీచ్ సమీపంలో ఉంటున్నాడు. కాగా సుమారు ఆరేళ్ళ క్రితం ఈడ్పుగల్లులో ఉంటూనే తల్లిదండ్రులతో కలిసి పనుల నిమిత్తం అక్కడకు వెళ్లి స్ధిరపడ్డాడు. అయితే అప్పుడప్పుడు విజయవాడ వచ్చి ఈడ్పుగల్లు పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ మళ్లీ వెళ్లిపోతుంటాడు. రాత్రివేళ తాళం వేసి ఉన్న ఇళ్ళు గుర్తించి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్నాడు. ఈవిధంగా కంకిపాడు పోలీస్టేషన్ పరిధిలో జూలై 23వ తేదీన ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు. ఆగస్టు 14వ తేదీన ఈడ్పుగల్లు గాంధీ బొమ్మ సమీపంలో మరో ఇంటి తాళాలు పగులగొట్టి దోచుకున్నాడు. ఆగస్టు 17వ తేదీన కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామంలో, సెప్టెంబర్ 5వ తేదీన పెనమలూరు పరిధిలోని గోశాల గ్రామంలోని ఇళ్ళల్లో చోరీలకు పాల్పడ్డాడు. గతంలో కూడా పలు కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లి బెయిల్‌పై తిరిగి వచ్చి మరలా నేరాలకు పాల్పడుతూ వస్తున్నాడు. ఆయా నేరాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి చోరీ సోత్తు రికవరీ చేసినట్లు తెలిపారు. విలేఖరుల సమావేశంలో ఏసిపి వర్మ, సిఐలు కృష్ణంరాజు, వినయ్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.