క్రైమ్/లీగల్

చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన వ్యక్తి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 27: చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన కేసులో ఓ వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి రూ.3.50 లక్షలు విలువైన 12.5కాసుల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు క్రైం డీసీపీ బి రాజకుమారి తెలిపారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన షేక్ సందాని (20) ఐటిఐ చదువుతుండగా తన స్నేహితుడైన పాత నేరస్తునితో కలిసి నేరాలకు అలవాటు పడ్డాడు. ఈక్రమంలో చైన్‌స్నాచింగ్‌లకు తెర తీశాడు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళే మహిళలను లక్ష్యంగా చేసుకుని వారి మెడలోని బంగారు గొలుసులు లాక్కుని పారిపోవడం నేరాలకు పాల్పడుతున్నాడు. ఈక్రమంలో సత్యనారాయణపురం పోలీస్టేషన్ పరిధిలో ఈ ఏడాది జూలై 29వ తేదీన మధురానగర్ ఇందిరాకాలనీలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసు మోటారు సైకిల్‌పై వచ్చి దొంగిలించాడు. అదేవిధంగా సెప్టెంబర్ 2వ తేదీన సత్యనారాయణపురం లక్ష్మీనగర్‌లో మరో మహిళ మెడలోని బంగారు గొలుసు అపహరించి పరారయ్యాడు. అదేరోజు మాచవరం పోలీస్టేషన్ పరిధిలోని గుణదల షిర్డి నగర్‌లో ఓ మహిళ మెడలోని గొలుసు లాక్కుని పరారయ్యాడు. ఆయా కేసుల్లో దర్యాప్తు చేపట్టిన సిసిఎస్ పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి అతని వద్ద నుంచి చోరీ సొత్తు రికవరీ చేసినట్లు తెలిపారు. విలేఖరుల సమావేశంలో క్రైం ఏసిపి వర్మ, సిఐలు వినయ్‌మోహన్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.