క్రైమ్/లీగల్

డీజిల్ మాఫియాపై దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, సెప్టెంబర్ 27: కట్టుబడిపాలెంలో డీజిల్ మాఫియాపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు విజయవాడ డివిజిన్ ఎఎస్‌ఒ కోమలి పద్మ, పిడిఎస్ డిటి రామకృష్ణ దాడులు చేశారు. ఇక్కడ పలు చమురు సంస్థల నుంచి పెట్రో ఉత్పత్తులను లోడింగ్ అయిన తర్వాత ట్యాంకర్ల నుంచి డ్రైవర్లతో కుమ్మకై దొంగిలిస్తున్నారు. ఇలా దొంగతనం చేసిన డీజిలు, ఇతర చమురును లూజు విక్రయాలకు పాల్పడుతున్న బడ్డీకొట్లకు, ఇతర దుకాణాలకు అమ్ముకుని పైసా ఖర్చు లేకుండా లక్షలు ఆర్జిస్తున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా అధికారులు ఇప్పుడు కళ్ళు తెరిచి దాడులు చేయడం కొసమెరుపు. అనధికారికంగా నిల్వచేసిన 1200 లీటర్ల డీజిలును స్వాధీనం చేసుకుని, దీనికి బాధ్యులైన బాణావత్ లక్ష్మీ, బాణావత్ శ్రీనునాయక్, వెనె్నల లక్ష్మీనారయణ, గణపతిలపై కేసు నమోదు చేసినట్లు వీఆర్వో సింహాద్రి తెలిపారు.