క్రైమ్/లీగల్

ధూల్‌పేట్ ఎక్సైజ్ ఠాణాపై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, సెప్టెంబర్ 27: గుట్టుచప్పుడు కాకుండా గంజాయ అమ్ముతున్న వారిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేస్తే, వారి బంధువులు ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఘటన మంగళహాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ధూల్‌పేట్ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్, మంగళహాట్ ఇన్‌స్పెక్టర్ రణ్‌వీర్ రెడ్డి కథనం ప్రకారం ధూల్‌పేట్ ప్రాంతంలో ఉత్తారాది నుంచి వలస వచ్చి గంగాభౌళి బల్‌రాంగల్లి పక్కన ఏసిమ్‌ఖాన్ ప్రాంతంలో నివసిస్తున్న అర్తీబాయి ఇంటిపై బుధవారం సాయంత్రం ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి వారి ఇంట్లో సుమారు ఒకకిలో రెండు వందల గ్రాముల గంజాయని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న అర్తీబాయి(44)తో పాటు కుమారుడు ఉదేష్ సింగ్(24)ను కూడా ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఒక్కసారిగా అర్తీబాయి బంధువులు వచ్చి పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసివారిని విడిపించుకుని పోయారు. ఎక్సైజ్ శాఖ పోలీసులు అర్తీబాయిపై కేసు నమోదు చేయాలి, అర్తీబాయి కుమారుడు ఉదేష్‌సింగ్‌పై కేసు ఎలా పెడుతారని ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో గోడవకు దిగారు. ఎక్సైజ్ పోలీసులకు, ఆర్తీబాయి బంధువుల మధ్య తొపులాట జరిగింది. ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నవీన్‌కుమార్‌తో పాటు ఇన్‌స్పెక్టర్ గంగాధర్‌పై దాడి చేయడంతో చిన్నచిన్న దెబ్బలు తగిలినట్లు మంగళహాట్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం ఫిర్యాదు చేసినట్లు సీఐ తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేస్తామని ఇన్‌స్పెక్టర్ రణ్‌వీర్ రెడ్డి పేర్కొన్నారు.