క్రైమ్/లీగల్

రైలు కిందపడి విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్టేషన్‌ఘన్‌పూర్, సెప్టెంబర్ 27: మండల కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న దామెర శివాజీ(18) అనే విద్యార్ధి గూడ్స్‌రైలు కిందపడి మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన రాజకొంరయ్య, భాగ్యలక్ష్మిల కుమారుడు దామెర శివాజి మండలంలోని శివునిపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ట్రిపుల్ ఇ మూడవ సంవత్సరం చదువుతున్నట్లు వారు తెలిపారు. పాలిటెక్నిక్‌లో చదువుకుంటూ స్థానికంగా ప్రైవేటు హాస్టల్‌లో ఉంటున్నాడు. బుధవారం రాత్రి భోజనం తరువాత హాస్టల్ నుండి బయటికి వెళ్ళిన శివాజి గురువారం ఉదయం వరకు కూడా రాకపోవడంతో కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ నేపధ్యంలో స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద పట్టాలపై శవం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహం దామెర శివాజిగా గుర్తించారు. గూడ్స్‌రైలు కిందపడి మృతి చెందడంతో ఆత్మహత్య గా అనుమానిస్తున్నారు. మృతిపై పూర్తి వివరాలు తెలువాల్సి ఉందని ఖాజీపేట రైల్వే ఎసై జితేందర్‌రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

నెమలిని ఠాణాలో అప్పగించిన యువకుడు
రఘునాథపల్లి, సెప్టెంబర్ 27: జాతీయ పక్షి(నెమలి)ని మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌లో స్థానిక యువకుడు మహ్మద్ రియాజ్ గురువారం అప్పగించారు. మండల కేంద్రానికి చెందిన రియాజ్ రఘునాథపల్లి పొట్టిగుట్టపై వీజిఎస్ పనులను చేస్తున్నాడు. ఈ క్రమంలో దెబ్బలు తాకి అల్లాడుతున్న జాతీయ పక్షి నెమలి అతని కంట పడింది. దీంతో రియాజ్ జాతీయ పక్షిని పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. దీంతో పోలీసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించగా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మంగీలాల్, బాలకృష్ణలు పోలీసు స్టేషన్‌కు చేరుకొని జాతీయ పక్షిని వరంగల్‌కు తరలించారు.