క్రైమ్/లీగల్

మనస్థాపంతో గిరిజన రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరడిగొండ,సెప్టెంబర్ 27: నేరడిగొండ మండలంలోని వాగ్దారి గ్రామానికి చెందిన గిరిజన రైతు రాథోడ్ పాండు(60) పోలీసుల వేదింపులు తాళలేక మనస్థాపంతో గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే రాథోడ్ పాండు పేకాట ఆడుతూ పారిపోయాడని పోలీసులు ఆదివారం కేసు నమోదు చేయగా ఎస్సై వేదింపులు భరించలేకే తీవ్ర మనస్థాపంతో పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యాంతమయ్యారు. ఎస్సై వేదింపులు గిరిజనుడి ప్రాణాలను బలిగొన్నాయని, ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతదేహంతో జాతీయ రహదారిపై బైటాయించడంతో రాకపోకలు స్థంభించిపోయాయి. సుమారు మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. దీంతో స్పందించిన ఆదిలాబాద్ ఏ ఎస్పీ మోహన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని ఎస్సై హరిశేఖర్‌ను సస్పెండ్ చేస్తున్నామని, మృతుని కుటుంబంలో ఒకరికి హోంగార్డు ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో అందోళన విరమించారు. స్థానిక బోథ్ కాంగ్రెస్ ఇంచార్జి అనిల్ జాదవ్, డిఎస్పీ వెంకటేష్, సిఐ సతీష్‌కుమార్ తదితరులు సంఘట స్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి సర్దిచెప్పారు.