క్రైమ్/లీగల్

డెంగ్యూ వ్యాధితో ఆర్టీవో కార్యాలయ ఉద్యోగి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ సిటీ, సెప్టెంబర్ 28: రాజమహేంద్రవరం ఆర్టీఒ కార్యాలయంలో పరిపాలనాధి కారిగా పనిచేస్తున్న కిరణ్‌పాల్ డెంగీ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం మృతి చెందారు. ఇటీవల ఆయన తీవ్ర జ్వరంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు కాకినాడ నగరంలో ఉన్న ఓ కార్పొరేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెల్లారు. అక్కడి వైద్యులు ఏఓ కిరణ్‌పాల్‌ను పరీక్షించి డెంగీ వ్యాధికి గురైనట్లు నిర్ధారించి చికిత్స అందజేస్తున్నారు. శుక్రవారం ఆయన ఆరోగ్యం విషమించి మృతి చెందారు. ఆయన కాకినాడ నగరం మధురానగర్‌లో నివాసం ఉంటున్నట్లు తెలిసింది.

ప్రియుడితో పెళ్లి జరిపించాలని యువతి దీక్ష

మలికిపురం, సెప్టెంబర్ 28: ప్రేమించానని నమ్మబలికి శారీరక వాంఛలు తీర్చుకుని పెళ్లి ప్రస్థావన తెచ్చేసరికి ముఖం చాటేసిన యువకుడితోనే పెళ్లి జరిపించాలంటూ బట్టేలంక గ్రామానికి చెందిన కొల్లు దేవిశ్రీ అనే యువతి ఆమె ప్రియుడు పెసింగు బాలరాజు ఇంటి వద్ద దీక్షకు దిగింది. గత నాలుగు సంవత్సరాలుగా తనను ప్రేమిస్తున్నాడని, అధిక కట్నం కోసం వేరే సంబంధం చేసుకునే ప్రయత్నం చేయడంతో తాను సంఘ పెద్దలకు ఫిర్యాదు చేశానని పెద్దలు తననే వివాహం చేసుకోమని చెప్పినా అతడు వినకపోవడంతో దీక్షకు దిగానని దేవిశ్రీ తెలిపింది. అతనితోనే వివాహం జరిపించే వరకు దీక్షను విరమించనని ఆమె పేర్కొంది.