క్రైమ్/లీగల్

ఆన్‌లైన్ మోసగాడి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 28: ఆన్‌లైన్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని నగరంపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా అర్బన్ పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో నిందితుడి వివరాలను ఎస్‌పి విజయారావు మీడియాకు వెల్లడించారు. ప్రకాశం జిల్లా, కొరమోలు మండలం, గోపనపల్లి గ్రామానికి చెందిన వీరంరెడ్డి సుమన్‌రెడ్డి ఎంటెక్ పూర్తిచేసి బెంగళూరు వెళ్లి ఉద్యోగం చేసే ప్రయత్నంలో సాఫ్ట్‌వేర్ కోర్సును కూడా పూర్తిచేశాడు. ఈ నేపథ్యంలో సుమారు ఆరు నెలల క్రితం నిందితుడు ఓ యాప్‌లో ఆకర్షణీయమైన మహిళ ఫొటో, ఫోన్ నెంబర్ చూసి ఆన్‌లైన్ ద్వారా 60 వేల రూపాయలు పంపగా అటు నుండి ఎటువంటి జవాబు రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. అప్పటినుండి ఆన్‌లైన్‌లో ఆకర్షణీయమైన మహిళల ఫొటోలు పెట్టి గత ఆరు నెలల నుండి తాను మోసపోయిన పద్ధతిలోనే పలువురిని మోసగించి అక్రమ సంపాదనకు అలవాటుపడ్డాడు. గుంటూరు బ్రాడీపేటకు చెందిన పాముల జగదీష్ 19,500 రూపాయలను మోసపోయినట్లు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నగరంలోని తాజ్‌హోటల్‌లో నిందితుడు సుమన్‌రెడ్డి బస చేసినట్లు సమాచారం అందుకుని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి ఒక కారు, ల్యాప్‌టాప్, మూడు సెల్‌ఫోన్‌లు, 8 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పలువురిని మోసగించడం ద్వారా ఆర్జించిన 21,58,000 రూపాయలను సుమన్‌రెడ్డి తన బ్యాంకు ఖాతాలో భద్రపర్చుకున్నట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో ప్రతిభకనబర్చిన పోలీసులను అర్బన్ ఎస్‌పి అభినందించారు.