క్రైమ్/లీగల్

కండలేరులో విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాపూరు, సెప్టెంబర్ 28: రాపూరు మండలం కండలేరు డ్యామ్‌లోని తెలుగుగంగ కాలనీకి చెందిన ఓ నివాసగృహంలో శుక్రవారం జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వారు దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా బి టైప్ ప్రభుత్వ నివాసగృహంలోని 14వ నెంబరు ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యం, పప్పుదినుసలతో పాటు నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు పక్కా సమాచారంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. సమీపంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల కళాశాలకు చెందినవిగా పలువురు అనుమానిస్తున్నారు. గత కొంతకాలంగా గురుకుల బాలికల కళాశాలకు చెందిన వ్యక్తే ఎవరికీ అనుమానం రాని రీతిలో కొందరు అధికారులతో కుమ్మక్కై ఈ నిత్యావసర వస్తువులను రహస్యంగా నిల్వచేసి బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టకేలకు కొందరు గత కొంతకాలంగా దొడ్డిదారిన బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తున్న సమాచారాన్ని కొందరు జిల్లా విజిలెన్స్ అధికారులరు తెలియజేయడంతో పకడ్బందీగా వ్యూహాత్మకంగా కండలేరు ప్రభుత్వ నివాసంపై దాడి చేసి వీటిని పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కోటేశ్వరరావు అనే వ్యక్తిపై అనుమానాలు వ్యక్తం కావడంతో అతన్ని విచారిస్తున్నారు. ఈ దాడుల్లో జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిఎస్పీ, సిఐ వెంకటరమణ, విజిలెన్స్ అధికారి ధనుంజయ, రాపూరు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రామేశ్వరి ఈ దాడుల్లో పాల్గొన్నారు.