క్రైమ్/లీగల్

విద్యుదాఘాతంతో యువరైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాడికి, సెప్టెంబర్ 29 : మండల పరిధిలోని వీరారెడ్డిపల్లికి చెందిన రైతు పేరం శిరీష్‌రెడ్డి (25) విద్యుదాఘాతంతో శనివారం మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు తన పొలంలో ట్రాన్స్‌ఫారం వద్ద లైన్‌ను ఆఫ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే రైతులు, కుటుంబీకులు 108 సహాయంతో యాడికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గతంలో శిరీష్‌రెడ్డి తండ్రి కూడా విద్యుదాఘాతంతోనే మృతి చెందడంతో తల్లి ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ ఫణీంద్రనాథ్‌రెడ్డి పరిశీలించారు.
విద్యుదుఘాతంతో కార్మికుడి మృతి
కళ్యాణదుర్గం, సెప్టెంబర్ 29 : పట్టణంలోని బైపాస్ రోడ్డులో కాంట్రాక్టు కార్మికుడు రాజు (26) శనివారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. శెట్టూరు మండలం బోచ్చుపల్లి గ్రామానికి చెందిర రాజు కళ్యాణదుర్గం సబ్‌స్టేషన్ పరిధిలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇందులో భాగంగా స్థానిక బైపాస్ రోడ్డులో కొత్త ఏర్పాటు చేసిన స్తంబానికి విద్యుత్ తీగలు లాగుతుండగా మరో లైనుకు ఉన్న వైర్లు తగిలాయి. దీంతో కింద పడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారన్నారు. కుటుంబ సభ్యులు ఆందోళన చేయడంతో కాంట్రాక్టర్ల, విద్యుత్ శాఖ అధికారులు రాజు కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.