క్రైమ్/లీగల్

చెర్లోపల్లెల్లో విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవుకు, అక్టోబర్ 5 : మండల పరిధిలోని చెర్లోపల్లె, రామాపురం గ్రామాలకు చెందిన నాపరాయి గనులపై శుక్రవారం విజిలెన్స్, మైనింగ్ శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. ఆకస్మికంగా చేసిన దాడుల్లో అనుమతి లేని కంప్రెజర్, 2 ట్రాక్టర్లు, ఎలక్ట్రికల్ డిటోనేటర్స్, జిలెటిన్ స్టిక్స్, కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా విజిలెన్స్ డీఎస్పీ దేవదానం మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ శివకోటిబాబురావు ఆదేశాల మేరకు తాము మైనింగ్ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి ఎలాంటి అనుమతులు లేని పేలుడు పదార్థాలు, వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అలాగే మైనింగ్ లీజు ఓనర్ సూర్యనాగిరెడ్డి, చెర్లోపల్లెకు చెందిన నాగముని, పేలుడు పదార్థాలు సరఫరా చేసిన నరసింహులుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నాగమునిని అరెస్టు చేశామని మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారని వారి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వెంట విజిలెన్స్ సీఐ లక్ష్మయ్య, ఎస్‌ఐ జయన్న, బనగానపల్లె మైనింగ్ ఏడీ వేణుగోపాల్, తహశీల్దార్ రామక్రిష్ణారెడ్డి, ఏజీ రామశివారెడ్డి, సర్వేయర్, పోలీసులు, మైనింగ్ శాఖ సిబ్బంది ఉన్నారు.