క్రైమ్/లీగల్

ఇద్దరు జనశక్తి నక్సలైట్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, అక్టోబర్ 5: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇద్దరు జనశక్తి నక్సలైట్లు పట్టుబడ్డారు. ఎన్నికల వేళ వీరు పోలీసులకు ఆయుధాలతో పట్టుబడడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొంతకాలంగా నక్సలైట్ల ఉనికి కనుమరుగైన నేపథ్యంతో తాజాగా ఇక్కడ గతంలో తీవ్ర ప్రాబల్యం కొనసాగించిన జనశక్తి మూ లాలు మళ్లీ కనిపించడంతో పోలీసులు వీరి కదలికలపై అప్రత్తమయ్యారు. శుక్రవారం తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల వద్ద వాహనాలు సోదా చేస్తున్న సమయంలో ఇద్దరు సీపీఐ (ఎంఎల్) జనశక్తి నక్సలైట్లు ఆయుధాలతో పట్టుబడ్డారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఎస్పీ రాహుల్ హెగ్డే విలేఖరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. సిద్దిపేట నుంచి బైక్‌పై వస్తూ జిల్లెల్ల చెక్ పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో జనశక్తి గ్రూపు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ కార్యదర్శి, చిన్నలింగాపూర్‌కు చెందిన జక్కుల బాబు (38), అలియాస్ కుంటయ్య, అలియాస్ బాబయ్య, రామన్నపల్లెకు చెందిన జనశక్తి మిలిటెంట్ తోకల శ్రీకాంత్ (28)ను అరెస్టు చేశారు. సిరిసిల్ల జిల్లాలో జనశక్తి పార్టీ ఉనికి కొరకు నియామకాలు జరపుతున్నారనే సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులకు వీరు చిక్కారు. అరెస్టు అయిన బాబు వద్ద ఒక వౌ సర్ పిస్టల్, 159 ఎంఎం రౌండ్ల బుల్లెట్లు, రూ.44,600 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం, మిలిటెంట్ తోకల శ్రీకాంత్ వద్ద ఎస్‌టీసీ మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. వీరి కదలికలను సాగుతున్నాయన్న సమాచారంతో సిరిసిల్ల రూరల్ సీఐ అనిల్‌కుమార్, ఎస్సైలు వెంకటకృష్న, రాజశేఖర్‌లు పక్కా సమాచారం మేరకు జిల్లెల్ల చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు అనుమానితులు పట్టుబడ్డారు. వీరిని విచారించగా వీరు జనశక్తి నక్సలైట్లుగా గుర్చినట్టు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇందు లో సీపీఐ (ఎంఎల్) జనశక్తి రాష్ట్ర కార్యదర్శి విశ్వం అలియాస్ విశ్వనాథ్ పిస్టల్‌ను జక్కుల బాబుకు ఇచ్చినట్టు విచారణలో తేలినట్టు చెప్పారు. జక్కుల బా బుపై 11 కేసులు, అలాగే రాష్ట్ర కార్యదర్శి విశ్వం, బాబుపై కలిసి మరో ఏడు కేసులున్నట్టు తెలిపారు. గతంలోనే వీరిపై రౌడీ షీట్ తెరిచామని, వీరు కాంట్రాక్టర్లు, వ్యాపారులను బెదిరించి డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారని, రెండు హత్య కేసులు కూడా ఉన్నాయన్నారు. పార్టీని బలోపేతం చేయడం కోసం వీరు ప్రయత్నిస్తున్నారని, ఈ నేపథ్యంలో బైక్‌పై హెల్మెట్‌తో రావడం పట్ల వీరిని తొలుత గుర్తించలేదని, అనుమానిస్తూండగా వీరు పారిపోయే ప్రయత్నం చేయడంతో పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించినట్టు ఎస్పీ తెలిపారు. వీరిని శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ ఎన్.వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.