క్రైమ్/లీగల్

బంగారు దుకాణంలో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 6: తిరుపతి బజారు వీధిలోని ఓ బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. రూ. 80 లక్షలు విలువచేసే 2 కేజీల, 250 గ్రామల బంగారు గొలుసులు గల్లంతయ్యాయి. దొంగలు ఆధారాలు లభించకుండా దుకాణంలోని సీసీ ఫుటేజ్ రికార్డులను కూడా ఎత్తుకెళ్లారు. దుకాణ యజమాని ఫిర్యాదు మేరకు క్రైం పోలీసులు, క్లూస్ టీం రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ భారీ చోరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బజారు వీధిలోని లావణ్య బంగారు దుకాణం యజమాని హేమంత్ శుక్రవారం రాత్రి యథావిధిగా దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయం దుకాణం తెరవడానికి హేమంత్ వచ్చిన సమయంలో దుకాణం తాళాలు పగులగొట్టి ఆభరణాలు చోరీ చేసి ఉన్న విషయాన్ని గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే వెస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్రైం డిఎస్పీ రవిశంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐలు, ఎస్‌ఐలు, క్లూస్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. బాధితుడు హేమంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.