క్రైమ్/లీగల్

లంకెలపాలెంలో వ్యక్తి హత్య..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక/పరవాడ, అక్టోబర్ 8: నిత్యం బిజీగా ఉండే లంకెలపాలెం కూడలికి కూతవేటు దూరంలో ఒక వ్యక్తి హత్యకు గురి అయ్యాడు. హత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో పరవాడ పోలీసులు అనే్వషణ చేస్తున్నారు. అక్రమ సంబంధమే సదురు వ్యక్తి హత్యకు కారణంగా అందరూ పోలీసులు ఒక నిర్థారణకు వచ్చారు. మృతుడు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే నిందితుడ్ని పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. మృతుడు అన్నయ్య సైతం అక్రమ సంబంధంపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త హత్యలో భార్య హస్తం ఉందా అన్న అనుమానాలపై పోలీసులు అనే్వషణ. అయితే ఆదివారం రాత్రి మాత్రం భార్య ఇంటి వద్దే ఉన్నట్లు పోలీసుల చెబుతున్నారు.ఈ హత్యకు సంబంధించి పరవాడ పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించారు. కానీ అనుమానుతుడు కోసం పోలీసులు అనే్వషణ చేస్తున్నారు. అనుమానుతుడు అగనంపూడి శివారు డొంకాడకాలనీకి చెందిన వాడుగా పలువురు భావిస్తున్నారు. దీనికి సంబంధించి పరవాడ పోలీసులు అందించిన వివరాలిలావున్నాయి. మహావిశాఖ గాజువాక జోనల్ పరిధి 56వ డివిజన్ మంత్రిపాలెం గ్రామానికి చెందిన షేక్ మదీనా(40) రోడ్డు గ్లాడర్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. అయితే గ్లాడర్ గత నెల రోజుల నుండి పని చేయక పోవడంతో తన దగ్గర బంధువుకు సంబంధించిన అనకాపల్లి రూరల్ మండలం, రేబాక గ్రామంలో గల మాంసం దుకాణంలో మదీనా పని చేస్తున్నారు. ఆదివారం మాంసం దుకాణంలో పని చేసేందుకు వెళ్లిన మదీనా రాత్రి 8.40 గంటల సమయంలో తన స్నేహితుడు వకీలతో కలిసి ఆటోలో లంకెలపాలెం కూడలికి చేరుకున్నారు. లంకెలపాలెం మదీనా దిగి పోవడంతో స్నేహితుడు తన స్వగ్రామం డొంకాడ వెళ్లి పోయినట్లు పోలీసులు తెలిపారు. రాత్రి 9.30 గంటల సమయంలో మృతుడు మదీనా భార్య షీలార్బీ వకీల్‌కు ఫోన్ చేసి తన భర్త కోసం ఆరా తీసింది. అయితే మదీనా 8.30 గంటలకే లంకెలపాలెం చేరుకున్నట్లు సమాచారం అందించారు. మదీనాకు సంబంధించి ఫోన్ పని చేయలేదు. ఈ తరుణంలో సోమవారం ఉధయం మదీనా కోసం అనే్వషణ చేస్తుండగా లంకెలపాలెం కూడలికి సమీపంలో తుప్పల వద్ద మృతి చెంది కనిపించారు. వెంటనే స్థానికులు పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు మెడ నులిపినట్లు, శరీరం గాయాలు, ముక్కు నుండి రక్తం కారుతుండంతో హత్యగా భావించారు. వెనువెంటనే డాగ్‌స్క్యేడ్, క్లూస్ టీంను రంగంలోకి దించారు. అయితే మృతుడు భార్యతో వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తియే ఈ హత్య చేసి ఉంటాడని మృతుడు కుటుంబీకులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా నిందుతుడ్ని గుర్తించడం జరిగింది. మదీనా లంకెలపాలెం కూడలిలో ఆటో దిగి నడిచి వెళ్తున్న సమయంలో వెనక నుండి పోలీసులు నిందితుడుగా భావిస్తున్న వ్యక్తి వెళ్తున్న కీలకమైన సీపీ పుటేజ్ పోలీసుల చేతికి చిక్కినట్లు తెలిసింది. సంఘటనా స్థలాన్ని గాజువాక ఎసిపి రంగరాజు, పరవాడ ఇన్‌స్పెక్టర్ బి.సిహెచ్.సోమునాయుడు, దువ్వాడ, స్టీల్‌ప్లాంట్ ఇన్‌స్పెక్టర్లు కిశోర్, టి.లక్ష్మిలతో పాటు పరవాడ సబ్ ఇన్‌స్పెక్టర్ జి.వెంకటరావులు సందర్శించి పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరించింది. సంఘటనా స్థలంలో మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు మదీనాకి సంబంధించిన సెల్‌ఫోన్, చెప్పులు కాస్త దూరంగా పడి ఉన్నాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పరవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

హెచ్‌పీసీఎల్‌లో ప్రమాదం

గాజువాక, అక్టోబర్ 8: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చెందిన విశాఖపట్నం రిఫనరీలో సోమవారం స్వల్ప అగ్రి ప్రమాదం చోటు చేసుకుంది. భద్రతపై ప్రత్యేక అనుభవనం కలిగిన సిబ్బంది వెనువెంటనే సంఘటన స్థలానికి అగ్నిమాపక శకటాలతో చేరుకుని క్షణాల్లో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పదని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. హెచ్‌పిసిఎల్ యాజమాన్యం చిన్న ప్రమాదం అని తోచి పుచ్చింది. కార్మిక వర్గాలు అందించిన సమాచారం మేరకు ఇటిపి-2 వద్ద ట్యాంక్‌లో నుండి వేస్ట్ ఆయల్ ఓవర్ ప్లో అయిందని, ఓవర్ ప్లో అయిన ఆయల్‌కు నిప్పు అంటుకుని నల్లటి పొగ కమ్మేసిందని, ఈ పొగ మల్కాపురం ప్రధాన రహదారిపైకి కనిపించిందని స్థానికులు, కార్మికులు చెబుతున్నారు. చిన్న ప్రమాదం అయినప్పటికీ యాజమాన్యం అలార్ మ్రోగించి ఉద్యోగులను, కార్మికులు అప్రమత్తం చేశారు. అయితే సంఘటనా స్థలానికి భద్రత సిబ్బందితో పాటు అగ్నిమాపక శకటాలు వెళ్లి క్షణాల్లో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంత కార్మికులు పరుగులు తీసినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఫ్యాన్‌కు ఉరి పోసుకుని వ్యక్తి ఆత్మహత్య

గాజువాక, అక్టోబర్ 8: ఇంటిలో ఎవ్వరు లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరి పోసుకుని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మల్కాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి రైటర్ కె.మహేష్ అందించిన వివరాలిలావున్నాయి. మహావిశాఖ 46వ డివిజన్ పరిధి శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్న గుడివాడ రవికుమార్ (33) పెయింటర్‌గా పని చేస్తారు. అయితే రవికుమార్‌కు భార్య ఒక బాబు, ఒక పాప ఉన్నారు. భార్య పిల్లలను తీసుకుని మూడు రోజులు క్రితం శ్రీహరిపురం తన కన్నవారి ఇంటికి వెళ్లినట్లు చెబుతున్నారు. తల్లి విశాఖపట్నం వెళ్లినట్లు చెబుతున్నారు. మృతుడు రవికుమార్ పూటుగా మద్యం సేవిస్తారని పోలీసులు తెలిపారు. అలాగే అప్పులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఇంటిలో ఎవ్వరు లేని సమయంలో రవికుమార్ ఫ్యాన్‌కు ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకునేందుకు గల కారణాలను అనే్వషణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైటర్ మహేష్ తెలిపారు.