క్రైమ్/లీగల్

వేగావతి నదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొబ్బిలి(రూరల్), అక్టోబర్ 8: వేగావతి నదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతైన సంఘటన సోమవారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి పోలీసులు, కుటుంబీకులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలం ఎం బూర్జివలస పంచాయతీ పరిధిలో ఉన్న ఎం పనుకువలస గ్రామానికి చెందిన నాల్గవ తరగతి చదువుతున్న ఎన్ చరణ్(9), 3వ తరగతి చదువుతున్న సిహెచ్ నాని(8), ఎం బూర్జివలస గ్రామానికి చెందిన 5వ తరగతి చదువుతున్న జి పవన్‌లు ఆదివారం ఉదయం 10గంటల ప్రాంతంలో కొత్తపెంట సమీపంలో ఉన్న వేగావతి నదికి స్నానానికి వెళ్లారు. అయితే శనివారం రాత్రి వేగావతి నదిలో నీటి ప్రవాహం పెరగడంతో ఆ విషయాన్ని తెలుసుకోలేని విద్యార్థులు స్నానానికి దిగారు. దీంతో పనుకువలస గ్రామానికి చెందిన చరణ్, నానీలు వేగావతి నదిలో గల్లంతయ్యారు. ఎం బూర్జివలస గ్రామానికి చెందిన విద్యార్థి పవన్ మాత్రం ఇంటికి చేరుకున్నాడు. చరణ్ తల్లిదండ్రులు రామకృష్ణ, కుమారిలు, నాని తల్లిదండ్రులు శ్రీను, అన్నపూర్ణలు గ్రోత్‌సెంటర్‌లో ఉన్న ఇంఫెక్స్ కంపెనీలో కూలి పనులు చేస్తుంటారు. వారు ప్రతీ రోజులాగే ఆదివారం పనులకు వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు. ఇంటికి వచ్చేసరికి పిల్లలు కనిపించకపోవడంతో వెతకసాగారు. వీరితోపాటు స్నానానికి వెళ్లిన పవన్‌ను ప్రశ్నించగా విషయాన్ని తెలియజేశాడు. వెంటనే వేగావతి నది ప్రాంతానికి వెళ్లి వెతుకలాట ప్రారంభించగా ఎక్కడా జాడకనిపించలేదు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నది పరివాహాక ప్రాంతాల్లో గాలింపులు చర్యలు చేపట్టిన ఇంతవరకు విద్యార్థుల ఆచూకి కానరాలేదు. దీంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. విద్యార్థులు పట్టణంలో ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో ఎం పనుకువలస, బూర్జివలస గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
కుటుంబీకులను పరామర్శించిన మంత్రి సుజయ్
ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర భూగర్భ గనులశాఖామంత్రి సుజయ్‌కృష్ణరంగారావు సోమవారం ఎం పనుకువలస గ్రామానికి వెళ్లి చరణ్, నానిల కుటుంబీకులను పరామర్శించి జరిగిన సంఘటనను తెలుసుకున్నారు. ఈమేరకు తల్లిదండ్రులను ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. పూర్తిస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీస్, రెవెన్యూ, ఫైర్ సిబ్బందికి ఆదేశించారు. ఎవరైన నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈయనతోపాటు మాజీ ఎంపీపీ దామోదరరావు, మాజీ సర్పంచ్‌లు ఎస్ ఈశ్వరరావు, శ్రీరామ్మూర్తి, తదితరులు ఉన్నారు. అదేవిధంగా సంబంధిత అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట పార్వతీపురం రెవెన్యూ డివిజనల్ అధికారి బి సుదర్శనదొర, తహశీల్దార్ పి గణపతిరావులున్నారు.