క్రైమ్/లీగల్

వాచ్‌మెన్ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్, మార్చి 1: ఆర్థిక ఇబ్బందులతో వాచ్‌మన్ బలన్మరణం చెందిన సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నల్గొండ జిల్లా చందంపేట్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన లింగయ్య(54) బతుకుదెరువు కోసం నగరానికి కుటుంబంతో కలిసి వలసవచ్చాడు. లింగోజిగూడ డివిజన్ గ్రీన్‌పార్క్ కాలనీలో అంజయ్య నిర్మించి ఇంటి నిర్మాణం ముందున్న ఖాళీ స్థలంలో గుడిసె వేసుకొని నిర్మాణం వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. గురువారం తెల్లవారుఝామున లింగయ్య నిర్మాణంలో ఉన్న ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని అంజయ్యను లింగయ్య జీతం ఇవ్వాలని కోరగా అతను అందరి ముందు దూషించడంతో పాటు దాడి చేశాడని, మనస్థాపానికి గురైన లింగయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.