క్రైమ్/లీగల్

మురుగుబోదెలో ట్రాక్టర్ తిరగబడి ఇరువురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, అక్టోబర్ 8: మురుగు బోదెలో ట్రాక్టర్ తిరగబడి ఇరువురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందిన విషాద సంఘటన మండల పరిధిలోని వెలువోలు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీపురం గ్రామ పంచాయతీ శివారు పుచ్చగడ్డ గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమాని కొలుసు నాగబాబు (50) డ్రైవర్ డొక్కు శివాజీ (25)తో కలిసి సోమవారం ఉదయం వెలివోలు శివారు సీనేపూడి ఇసుక క్వారీకి వెళ్లారు. ట్రాక్టర్‌లో ఇసుక లోడ్ చేసుకుని వస్తుండగా వెలివోలు గ్రామ వంతెన వద్ద అప్రోచ్ రోడ్డు సరిగ్గా లేకపోవటంతో ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే ఉన్న మురుగు బోదెలోకి పల్టీ కొట్టింది. ట్రాక్టర్ కింద వీరు ఇరువురు పడిపోవటంతో ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందారు. కళ్ల ముందు ట్రాక్టర్ మురుగునీటిలోకి బోల్తా పడటాన్ని చూసిన స్థానికులు అతి కష్టం మీద ట్రాక్టర్ కింద పడి చనిపోయిన ఇరువురు మృతదేహాలను ఒడ్డుకు తెచ్చారు. విషయం తెలుసుకున్న అవనిగడ్డ డీఎస్పీ పోతురాజు ఘటనా స్థలికి వచ్చి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతదేహాలను శవ పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడు నాగబాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉండగా శివాజీ భార్య తొమ్మిది నెలల గర్భిణి కావడం విశేషం. ఇరువురి మృతితో పుచ్చగడ్డ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు.