క్రైమ్/లీగల్

వృద్ధ దంపతుల దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చర్ల, అక్టోబర్ 9: చర్ల మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో మంగళవారం ఉదయం రజక వృత్తి చేసుకునే వృద్ధ దంపతులను అతి కిరాతంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చర్ల బస్టాండ్ సమీపంలో ఒక రేకుల షెడ్డులో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని రజక వృత్తితో బతుకు వెళ్లదీస్తున్న పున్నం చుక్కయ్య(70), అతని భార్య ఎల్లమ్మ(60)లు దారుణ హత్యకు గురయ్యారు. తమ నివాసం వద్ద రోజువారిలా సోమవారం పని ముగించుకొని నిద్రకు ఉపక్రమించారు. హత్యకు గురైన చుక్కయ్య, ఎల్లమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు ఉన్నారు. వీరిలో ఇద్దరు గతంలో మృతి చెందారు. మిగిలిన ముగ్గురు కుమారులు సాయిలు, రమేష్, సుధాకర్‌లు రజక వృత్తినే నమ్ముకొని మండలంలోనే ఉంటున్నారు. ఈ ముగ్గురు కుమారుల్లో రమేష్ బస్టాండ్ వద్ద తల్లిదండ్రులు ఉంటున్న సమీపంలోనే నివాసం ఉంటున్నాడు. ఎప్పటిలాగానే సోమవారం రాత్రి సైతం తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిన రమేష్ తిరిగి ఇంటికి వచ్చాడు. మిగిలిన ఇద్దరు కుమారులు విజయకాలనీలో నివాసం ఉంటున్నారు. మంగళవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లే క్రమంలో చెంతనే తన తల్లిదండ్రులు ఉండే ప్రాంతానికి వెళ్లిన రమేష్‌కు రక్తపుమడుగులో ఉన్న తల్లిదండ్రులు కనిపించారు. అప్పటికే తండ్రి చుక్కయ్య చనిపోయాడు. పక్కనే ఉన్న ఎల్లమ్మ సైతం రక్తపుమడుగులో చావుబతుకల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణాన్ని చూసిన రమేష్ వెంటనే తన అన్నయ్య సాయి, తమ్ముడు సుధాకర్‌లకు సమాచారం ఇచ్చాడు. కొన ఊపిరితో ఉన్న ఎల్లమ్మను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొద్దిసేపటికే ఆమె ప్రాణాలు విడిచింది. రేకుల షెడ్డు బయట వృద్ధ దంపతులు వేర్వేరుగా మంచంలో పడుకున్నారు. వీరు నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వారు దాడి చేసి చంపినట్లు తెలుస్తోంది. ఇంట్లో ఉన్న గొడ్డలితో చుక్కయ్య, ఎల్లమ్మలను కిరాతంగా హత్య చేసినట్లు భావిస్తున్నారు. ఇంట్లో గొడ్డలి బయట పడేసి ఉంది. ఆ గొడ్డలికి రక్తపు మరకలు కనిపించకుండా కడిగినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
సంఘటన స్థలంలో క్లూస్‌టీం తనిఖీలు
చర్ల బస్టాండ్ ఆవరణలో వృద్ధ దంపతులు చుక్కయ్య, ఎల్లమ్మ మృత దేహాలను క్లూస్‌టీం క్షుణ్ణంగా పరిశీలించింది. సంఘటన స్థలాన్ని సీఐ సత్యనారాయణ సందర్శించారు. హత్యకు గల కారణాలపై ఆయన ఆరా తీస్తున్నారు. ఎస్సై రాజువర్మ ఆధ్వర్యంలో ఈ ఘటనపై లోతైన విచారణ సాగిస్తున్నారు. వృద్ధ దంపతులను ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, కుటుంబ కలహాలేమైనా ఉన్నాయా, ఆస్తి గొడవలు ఉన్నాయా, ఇంకేమైనా జరిగి ఉంటుందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం దుస్తులు ఇస్ర్తి చేసుకొని జీవనం సాగించే తమ తల్లిదండ్రులు ఏనాడూ తమపై ఆధారపడలేదని పెద్ద కుమారుడు బోరున విలపించాడు. ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని వెంటనే పట్టుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.