క్రైమ్/లీగల్

కంట్రీక్లబ్ పేరుతో ఆన్‌లైన్‌లో డిపాజిట్ల సేకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 2: కంట్రీక్లబ్ పేరు చెప్పి ఆన్‌లైన్‌లో డిపాజిట్లు సేకరించి పలువురిని మోసం చేసిస నేరగాడికి ఆరవ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష, రూ.1.10 లక్షలు జరిమాన విధించింది. ఈ కేసుకు సంబంధించి సిఐడి అదనపు డిజిపి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. న్యూ ముంబయికి చెందిన సర్వేష్ నిగం అలియాస్ సందేశ్ (36) కంట్రీ క్లబ్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఆ కంపెనీ లోగోలను వినియోగించుకుని దేశ వ్యాప్తంగా తప్పుడు మెయిల్స్ పంపించి పలువురు నుంచి డిపాజిట్లను సేకరించాడు. కంట్రీ క్లబ్‌లో సభ్యత్వం కింద ప్లాటినం, గోల్డ్, సిల్వర్ కార్డులు ఇస్తామంటూ మహిళలు, బహుళజాతి కంపెనీల ఉద్యోగులు, హాస్టల్ బాలికలకు, ఎన్‌ఆర్‌ఐలకు మెయి ల్స్ పంపించి వారిని నమ్మించి సభ్యత్వ ఫీజు కింద రూ.15 వేల నుంచి 30 వేల వరకు నగదు డిపాజిట్లు స్వీకరించాడు. 2006 నుంచి నిందితు డు అరెస్టు అయిన 2010 వరకు డిపాజిట్లు రూపంలో ముంబయి ఐసిఐసిఐ బ్యాంక్ అక్కౌంట్‌లో నగదు జమ చేయించుకున్నాడు. నకిలీ సాక్ష్యాధారాలు, సాంకేతిక ఆధారాలు పరిశీలించిన కోర్టు నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష, జరిమాన విధించింది. ఈ కేసును సిఐడి సైబర్ క్రైం డిప్యూటీ సూపరింటెండెంట్ బి.రవికుమార్ రెడ్డి దర్యాప్తు చేశారు.