క్రైమ్/లీగల్

ఏసీబీకి చిక్కిన ఆర్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊట్కూర్, అక్టోబర్ 12: ఊట్కూర్ తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రైతు చెన్నారెడ్డి తండ్రి భూమిని తన సోదరి శ్రీదేవిపై విరాసత్ చేయాలని గత కొన్ని నెలల నుండి రెవెన్యూ అధికారులకు ధరఖాస్తు చేసుకున్నారు. ఊట్కూర్ తహశీల్దార్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న రెవెన్యూ ఇన్స్‌స్పెక్టర్ సతీష్‌కుమార్‌రెడ్డి ఇంటిపై ఎకకాలంలో పథకం ప్రకారం దాడులు చేపట్టారు. ఈ సంఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ కథనం ప్రకారం ఇలా ఉన్నాయి. ఊట్కూర్ మండలంలోని పెద్దజట్రం గ్రామానికి చెందిన చెన్నారెడ్డి తన తండ్రి పేరున ఉన్న 13 ఎకరాల వ్యవసాయసాగు భూమిలో 6.05 ఎకరాల భూమి తన సోదరి శ్రీదేవి పేరుమీద విరాసత్ చేయాలని ఈ ఏడాది జూన్ నెలలో రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్నాడు. తన అక్క శ్రీదేవిపై భూమి మార్పిడి చేయాలని గతకొన్ని నెలల నుండి అధికారుల చూట్టు తిరిగాడు. ఈ నేపద్యంలో భూమిని తన అక్క పేరుపై మార్చేందుకు అర్‌ఐ సతీష్‌కుమార్‌రెడ్డి రూ.10వేలు లంచం ఇవ్వాలని చెన్నారెడ్డిని డిమాండ్ చేశాడు. దీంతో విసిగివేసారిన చెన్నారెడ్డి గత నెల 16న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దాంతో ఏసీబీ అధికారులు అర్‌ఐ సతీష్‌కుమార్‌రెడ్డి చెన్నారెడ్డితో లంచం తీసుకుంటున్న నేపథ్యంలో రెడ్‌హ్యాండ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్ కార్యాలయంలో సైతం రికార్డులను పరిశీలించారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు కమల్‌కుమార్, లింగస్వామి సిబ్బంది పాల్గొన్నారు. ఆర్‌ఐ సతీష్‌కుమార్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.