క్రైమ్/లీగల్

నేను డీసీపీని.. ఎన్‌కౌంటర్ చేస్తా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, అక్టోబర్ 21: ‘నేను డీసీపీని... ఎన్‌కౌంటర్ చేస్తా... కొండా మురళీని కొట్టిన.. నళిని ప్రభాత్‌తో కలిసి పనిచేసా... నీది నిషేధించిన పార్టీ... పీపుల్స్ వార్ పేరుతో ఎన్‌కౌంటర్ చేస్తా’నంటూ అధికార పార్టీకి చెందిన నాయకుడు ఒకరు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడిని ఫోన్‌లో బెదిరించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అధికార పార్టీనని చెప్పుకుంటున్న వ్యక్తికి న్యూడెమోక్రసీ పార్టీ నాయకుడికి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వైరల్‌గా మారింది. నర్సంపేట మండలానికి చెందిన ఓ వ్యక్తి గత కొనే్నళ్ల క్రితం హైద్రాబాద్‌లో స్థిరపడ్డాడు. ఆర్థికంగా బాగానే ఉన్న సదరు వ్యక్తి గత నెల రోజుల క్రితం నర్సంపేటకు వచ్చి ఏకంగా ప్రభుత్వ ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో మకాం వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు. అనంతరం పట్టణంలో ప్లాట్లు, ఇళ్లకు భయానాలు ఇస్తూ.. ప్రచారం చేశాడు. కొత్తగూడ మండలానికి చెందిన ఇద్దరు అన్నదమ్ముల పంచాయతీ గత కొనే్నళ్లుగా రావణకాష్టంలా నలుగుతోంది. ఈ పంచాయతీ న్యూడెమోక్రసీ లీగల్, అజ్ఞాత దళాల వద్దకు చేరింది. తమ్ముడు ఇటీవల సదరు అధికార పార్టీ నాయకుడిని ఆశ్రయించాడు. ఈ క్రమంలో న్యూడెమోక్రసీ నాయకుడికి అధికార పార్టీ నాయకుడనని చెప్పుకుంటున్న వ్యక్తి ఫోన్‌లో తాను ఏసీపీనని, డీసీపీనని, ఏసీబీ అధికారినని, తాను కాన్ఫరెన్స్‌లో ఉన్నానని తీవ్ర పదజాలంతో దూషించి బెదిరింపులకు గురి చేశాడు. దీంతో సదరు న్యూడెమోక్రసీ నాయకుడు తనను కులం పేరుతో పాటు తనను దుర్భాషలాడాడని, ఎన్‌కౌంటర్‌లో చంపుతానని బెదిరిస్తున్నాడని పేర్కొంటూ నర్సంపేట పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. న్యూడెమోక్రసీ నాయకుడు ఫిర్యాదు చేశాడని, విచారణ చేపడుతున్నట్లు నర్సంపేట ఏసీపీ సునీతా మోహన్ విలేఖరులకు తెలిపారు. కాగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని టౌన్ సీఐ కొత్త దేవేందర్‌రెడ్డి చెప్పారు.