క్రైమ్/లీగల్

‘సాధికార మిత్ర’పై పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో ‘సాధికార మిత్ర’ నియామకాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. రాజ్యాంగంలోని షెడ్యూల్ 11, 243(జీ), పంచాయతీ రాజ్ చట్టాలను ఉల్లంఘిస్తూ సాధికార మిత్రలను ఏపీ ప్రభుత్వం నియమించిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉమ్మడి హైకోర్టు తోసిపుచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సోమవారం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ వాదనలు వినిపించారు. సాధికార మిత్ర నియామకాల విషయంలో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఈ పిటిషన్ విచారణకు స్వీకరించరించలేమని ధర్మాసనం కొట్టివేసింది.